పల్లె పోరుకు సిద్ధమేనా..?

by Sumithra |
పల్లె పోరుకు సిద్ధమేనా..?
X

దిశ, కన్నెపల్లి : రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల పై మరోమారు దృష్టి సారించి వార్డుల విభజన, ఓటర్ల జాబితా సవరణ, నూతన ఓటరు నమోదు ప్రక్రియ, గ్రామ పంచాయతీ ఎన్నికల గుర్తులు నమూనా, బ్యాలెట్ ప్రింటింగ్, ఎన్నికలకు కావలసిన సామాగ్రి, ఎన్నికలకు నిర్వహించడానికి కావలసిన అన్ని రకాల చర్యల దృష్టి పెట్టడంతో పల్లెల్లో స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం కనబడుతుంది. ఎక్కడ చూసినా ఈసారి ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులగణన పై సర్వే పూర్తయింది, త్వరలోనే ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహిస్తుందని ఆశావాహులు ఇప్పటి నుండే సిద్ధపడుతున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన ఆధారంగా రిజర్వేషన్లు పెంచితే బీసీలకు మరింత లాభం చేకూరనుంది. సర్వే పూర్తయి కంప్యూటర్ లో నమోదు కూడా అయిపోయింది.

ఎన్నికల సంఘం వచ్చే మొదటి నెలలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉండడంతో స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటి నుంచే గ్రామాల్లో రాజకీయ నాయకులు ఎన్నికల్లో పోటీ చేసే ఆశావహులంతా ఇప్పటి నుండే గ్రామస్థాయిలో ప్రణాళికలను రూపొందించుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీ, జడ్పీటీసీలకు ఇప్పటికే మహిళలకు 50 శాతం రిజర్వేషన్ అమలులో ఉండడంతో రిజర్వేషన్ పురుషుడుడికి వచ్చినా, మహిళలకు వచ్చిన, ఏ రిజర్వేషన్ వచ్చినా ఎవరిని పోటీలో ఉంచాలనే దాని పై ఇప్పటికే పలు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులను గ్రామస్థాయిలో ప్రచారాన్ని మొదలుపెట్టి ప్రజలతో సంబంధాలను ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నట్లు సమాచారం. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి ఎక్కువ మంది పోటీ చేయాలని ఆశావహులంతా అధికార పార్టీ నేతల చుట్టూ తిరుగుతూ పోటికై ఎదురు చూస్తున్నారు. "ఒకే ఒరలో రెండు కత్తులు ఉండవు అన్నట్లు"గానే ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారమే లక్ష్యంగా పార్టీలో పలు పార్టీలకు చెందిన నేతలను చేర్చుకొని ఇప్పుడు ఎవరికి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అనుచరుడిగా మద్దతు ఇవ్వాలనే దాని పై నాయకులు తలలు పట్టుకుంటున్నారు.

ఈ సారి స్థానిక ఎన్నికల్లో నేను లేదా నా సతీమణిని పోటీ చేయించి గెలుపొందాలని రిజర్వేషన్ ఆడ, మగ వచ్చిన పోటీ చేయాలనే ఉత్సాహంతో పార్టీ ముఖ్య నాయకులు ఇప్పటికే గ్రామస్థాయిలో ప్రచారాన్ని సైతం సిద్ధం చేసుకున్నారు. ఏది ఏమైనా ఇప్పటికే సర్పంచుల పదవీకాలం పూర్తయి 11 నెలలు గడుస్తున్నా గ్రామాల్లో పాలన వ్యవస్థ లేదు, పల్లెల్లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఎవరు లేకపోవడంతో మండల, గ్రామస్థాయి పరిపాలన వ్యవస్థ నిర్లక్ష్యంగా మారింది. స్థానిక సంస్థలలో ఉండే వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కో ఆప్టెడ్ సభ్యుల వంటి ప్రజాప్రతినిధుల పదవి కాలం ముగిసిపోవడంతో మండల గ్రామస్థాయిలో ప్రత్యేక అధికారుల పాలన నత్తనడకన కోనసాగుతుంది.

పేరుకే గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించారే తప్ప వారు గ్రామ పంచాయతీలో ఉన్న సమస్యల పై శ్రద్ధ చూపకపోవడం, పారిశుధ్యం, వీధి దీపాల ఏర్పాటు, గత ప్రభుత్వం చేపట్టిన క్రీడా ప్రాంగణాలు, నర్సరీల నిర్వహణ, స్మశాన వాటికలు, డంపింగ్ యార్డ్, హరితహారం, కార్యక్రమాలను ప్రత్యేక అధికారులు సైతం పట్టించుకోకపోవడం వారి నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం. గ్రామస్థాయిలో ప్రజల సమస్యలను పట్టించుకునే నాథులే కరువయ్యారు. మండల స్థాయిలో 3 నెలలకు ఒకసారి జరిగే మండల సర్వసభ్య సమావేశాల్లో ప్రజాప్రతినిధులు లేకపోవడంతో సమావేశాలు నిర్వహణ సైతం మరుగున పడింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సర్వే ఆధారంగా కులగణన లెక్కల ప్రకారమే రిజర్వేషన్లను ప్రకటించి స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story