- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
MLC Kavitha: ఎన్ని కేసులు పెట్టిన నిప్పు కణికల్లా బయటికి వస్తాం.. కవిత సంచలన వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ కేసు వ్యవహారంలో జైలు నుంచి విడుదలైన చాలా రోజుల తర్వాత.. తొలిసారి నిజామాబాద్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వచ్చారు. ఈ సందర్భంగా శ్రేణులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) మాట్లాడుతూ.. నేను నిప్పులాంటి నిజామాబాద్ బిడ్డను.. దేనికి భయపడనని అన్నారు. మాజీ కేసీఆర్‌ను ఎదుర్కొనే ధైర్యం, దమ్ములేక నాపై, కేటీఆర్‌పై అక్రమ కేసులు పెట్టారు.. అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాది భయపడే రక్తం కాదు.. భయపెట్టే రక్తమని, తాము తప్పు చేయలేదు.. భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఎన్ని కేసులు పెట్టిన బీఆర్ఎస్ కార్యకర్తలు నిప్పు కణికల్లా బయటకు వస్తారని హాట్ కామెంట్స్ చేశారు. కేంద్రాన్ని ఎదురించి ప్రశ్నిస్తే బీజేపీ కేసులు పెడుతోందని, రాష్ట్రంలో అక్రమ కేసులపై గురించి చెప్పనవసరం లేదని ఆరోపించారు. పేరు మర్పిపోయినా, రైతులు భూములు ఇవ్వకపోయినా సీఎం రేవంత్ రెడ్డి కేసులు పెడుతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకింత భయం? అని, బరువు ఎత్తుకున్నోడు ఓపికతో ఉండాలని సూచించారు. పోరాటం చేసి రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వాళ్లం.. గట్టిగా నిలబడుతాం.. ప్రజల పక్షాన పోరాటం చేస్తామన్నారు.
డిగ్రీ చదువుకున్న ఆడపిల్లలకు స్కూటీల పంపిణీ ఏమైంది? అని ప్రశ్నించారు. మహిళలకు నెలకు రూ. 2,500, కళ్యాణలక్ష్మి కింద తులం బంగారం ఇవ్వలేదన్నారు. మైనారిటీలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా కాంగ్రెస్ సర్కార్ అమలు చేయలేదని విమర్శించారు. బీరాలు పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పటి వరకు పెన్షన్లు మొత్తాన్ని పెంచలేదన్నారు. మనం ఊరుకుంటే ప్రభుత్వం కదలదు.. ప్రతి ఒక్కరు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని సూచించారు. గ్రామ గ్రామాన కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని పిలుపునిచ్చారు.
పీపుల్స్ ఫ్రెండ్లీ పోలిసింగ్ పోయి.. రాష్ట్రంలో కాంగ్రెస్ ఫ్రెండ్లీ పోలీసింగ్ నడుస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో పోలీసుల జులుం నడుస్తున్నదని అన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన మంచి పనులను ప్రభుత్వం కొనసాగించాలన్నారు. రాబోయేది గులాబీ జెండా శకమే.. అందులో సందేహమే లేదని తేల్చి చెప్పారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో ఎగిరేది గులాబీ జెండానే అని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు శిష్యుడు అని, తెలంగాణ తల్లి స్థానంలో కాంగ్రెస్ మాతను ఏర్పాటు చేశారని విమర్శించారు. మన తెలంగాణ తల్లి మనకు కావాలి .. తెలంగాణ తల్లి మాదిరా.. కాంగ్రెస్ తల్లి మీదిరా అంటూ నినాదించారు. మన పొట్టమీదనే కాదు.. మన సంస్కృతిపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దాడి చేస్తున్నదని తీవ్ర విమర్శలు చేశారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని నిర్భందాలకు పాల్పడినా భయపడే ప్రసక్తే లేదని, మళ్లొకసారి నిజామాబాద్ పవర్‌ను సీఎం రేవంత్ రెడ్డికి రుచి చూపిద్దామని ఫైర్ అయ్యారు.