జీవితాన్ని బ్యాలెన్స్ చేసే పిల్లర్స్.. కలర్‌ఫుల్ లైఫ్ మీ సొంతం

by Manoj |   ( Updated:2022-03-10 06:48:49.0  )
జీవితాన్ని బ్యాలెన్స్ చేసే పిల్లర్స్.. కలర్‌ఫుల్ లైఫ్ మీ సొంతం
X

దిశ, ఫీచర్స్ : అద్దాల మేడలు, రంగుల పూతలు అందరినీ ఆకర్షిస్తాయి కానీ ఆ భవనాన్ని నిలబెట్టిన పునాదులు మాత్రం ఎవరికి కనిపించవు. జీవితం కూడా అంతే కనిపించని మూలస్తంభాల మీదే నిలబడుతుంది. కానీ ఆ పిల్లర్స్ ఎంత గట్టిగా ఉంటే మన లైఫ్ అంత అద్భుతంగా మెరిసిపోతుంటుంది. మరి జీవితంలో ఆ పిల్లర్స్ ఏంటి? వాటిని ఎలా ఉపయోగించుకోవాలి? లక్ష్యాన్ని సాధించడంలో వాటి పాత్ర ఎంత?

ప్రతి ఒక్కరికి జీవితంలో ఏదో సాధించాలనే ఆకాంక్ష తప్పక ఉంటుంది. అయితే ఆ లక్ష్యాన్ని మనస్ఫూర్తిగా నిర్దేశించుకున్నారా? లేదా అన్నదే ఇక్కడ ముఖ్యం. ఈ ప్రపంచంలో మీలా ఆలోచించే వ్యక్తి మీరొక్కరే. మీ హృదయం ఏం చెబుతుంది, మీ ఆలోచనలు దేనికోసం పరుగులు పెడుతున్నాయో ముందు తెలుసుకోవాలి. అందుకోసం ముందుగా మిమ్మల్ని మీరు తెలుసుకోవడం, ఆవిష్కరించుకోవడం ప్రధానం. ఇది మీ జీవితాన్ని నిర్దేశించేందుకు, కెరీర్‌లో ముందుకు సాగేందుకు సాయపడుతుంది. ఎందుకంటే మీకేం కావాలో మీకే తెలియకుండా భవిష్యత్తు కార్యాచరణ సాధ్యం కాదు.

ఆర్థిక లక్ష్యం :

మిలియనీర్ అవ్వడం అనేది మన లక్ష్యం కానవసరం లేదు, కానీ డబ్బు జీవితంలో ఒక ముఖ్యమైన పిల్లర్. నిత్యావసరాల నుంచి పదవీ విరమణ కోసం పొదుపు చేయడం వరకు లైఫ్ టోటల్‌గా మనీతోనే ముడిపడి ఉంటుంది. అందువల్ల ఆర్థిక సమృద్ధి ప్రాముఖ్యతను మనం తిరస్కరించలేము. డబ్బును పొదుపుగా వాడుకునే తెలివి ఉంటే సరిపోదు, అవసరాలకు అనుగుణంగా డబ్బు సంపాదించే తెలివి కూడా పెంచుకోవాలి. ఈ మేరకు కెరీర్ ఏదైనా సరే ఆర్థిక పరిస్థితులకు ఢోకా లేకుండా చూసుకోవడంతో పాటు భవిష్యత్తులో ఎలాంటి ఫినాన్షియల్ టెన్షన్ ఉండకుండా తగిన ప్రణాళికలు వేసుకోవాలి. అయితే కొన్ని సందర్భాల్లో మనసుకు నచ్చిన పనిచేయడం, చిన్న ఉద్యోగాలకే పరిమితం కావడం వల్ల తక్కువ సంపాదించొచ్చు. అలాంటి సందర్భాల్లో అదనపు ఉద్యోగం చేయడం మంచిది. ఇక జీవితాన్ని సమతుల్యంగా ఉంచేందుకు డబ్బు ప్రాధాన్యత గురించి చిన్నప్పటి నుంచే పిల్లలకు వివరించడం ఉత్తమం.

రిలేషన్‌షిప్స్ :

కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఆత్మీయులు, పరిచయస్తులు, మూగజీవాలు.. ఇలా అనేకమంది భిన్నమైన వ్యక్తులతో మనకు బంధాలు ఏర్పుడుతాయి. అయితే ఈ బంధాలు పాజిటివ్‌గా ఉన్నప్పుడు మన మైండ్ ఉత్సాహంగా, ఆనందంగా పనిచేస్తుంది. పొరపాటున ఎవరితోనైనా గొడవ పెట్టుకున్నా, చిన్నపొరపాటు జరిగినా ఆటోమేటిక్‌గా ఒత్తిడి పెరిగిపోతుంది. అందుకే ఏ రిలేషన్‌షిప్‌లో అయినా లిమిట్స్ మెయింటెన్ చేస్తే.. మన:శాంతిగా ఉండొచ్చు. ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు వెంటనే సారీ చెప్పేయడం వల్ల ఆ గొడవ తాలుకా ప్రభావం మన మీద పడదు. అందువల్ల హెల్తీ రిలేషన్‌షిప్స్ మనల్ని మరింత అద్భుతంగా పనిచేసేలా మారుస్తాయి. మన జీవితంలో ముఖ్యమైన వారికి సమయం వెచ్చించడం కూడా ప్రధానమే. వ్యక్తులకు సమయాన్ని వెచ్చించినప్పుడు, మీరు మరింత నమ్మకంగా, స్ట్రాంగ్‌గా కనెక్ట్ అవుతారు.

సమాజంపై ముద్ర :

జీవితంలో ఓ లక్ష్యాన్ని చేరుకునేందుకు ముందుగానే నిర్ణయం తీసుకోవడం ముఖ్యం. దీని అర్థం కేవలం ఒక నిర్దిష్ట వృత్తి లేదా ఆర్థిక లక్ష్యాన్ని సాధించడం మాత్రమే కాదు మీరు ప్రపంచంలోని ఏ రకమైన మార్క్‌ను వదిలివేయాలని అకుంటున్నారు అనే ఆలోచన కలిగి ఉండాలి. ఉదాహరణకు సింగర్, డ్యాన్సర్, స్టాండప్ కమెడియన్, ఆదర్శ వృత్తిలో జీవించడం కావచ్చు.. ఉపాధ్యాయుడు, రచయిత లేదా కుటుంబంలో సొంత వ్యాపారాన్ని కలిగి ఉన్న మొదటి వ్యక్తిగా ఉండటానికి ప్రయత్నించవచ్చు. ఇలా మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఈ సమాజం మిమ్మల్ని ఎలా గుర్తుంచుకోవాలని మీరు కోరుకుంటున్నారన్నదే దీని పరమార్థం. అయితే జీవిత గమనంలో మన పర్పస్ మారొచ్చు. మీరు ఇప్పుడు దృష్టి పెడుతున్న లక్ష్యం ఐదేళ్లలో మీ లక్ష్యానికి పూర్తిగా భిన్నంగా ఉండవచ్చు. బహుశా మీ ప్రస్తుత ఉద్దేశ్యం మీ కలల ఉద్యోగాన్ని పొందడమో, మీ తల్లిదండ్రులకు కొత్త ఇంటిని కొనుగోలు చేయడమో కావచ్చు. కానీ పదవీ విరమణ తర్వాత మీ ఉద్దేశాల్లో మార్పు రావొచ్చు.

ఉరిమే ఉత్సాహం :

మనలో ఉత్సాహాన్ని రేకెత్తించే కార్యకలాపాలు లేదా అభిరుచులు లేకపోతే జీవితం బోర్ కొడుతుంది. ఉదాహరణకు.. డొక్కు బండిని సూపర్ మోడల్‌గా మార్చడం, ఇంట్లో మొక్కలు పెంచడం ఇలా ఏదైనా కావచ్చు. మీ ఆత్మను ఉత్తేజపరిచేది ఏమిటో గుర్తించేందుకు ప్రయత్నించండి. ఇతరుల కలలను సాకారం చేయడంలో సాయపడుతున్నారా? ఇతరులను నవ్వించడంలో మీ ఆనందాన్ని వెతుక్కుంటున్నారా? కవిత్వం రాయడంలో సంతోషాన్ని పొందుతారా? సేవ చేయడమే మీ పరమావధా? ఏదైనా కానివ్వండి. మనం అనుభవించేవన్నీ ఉత్తేజకరమైనవి కానప్పటికీ, వ్యక్తిగత ఎదుగుదలను అనుభూతి చెందడం మనలో మరింత ఉత్సాహాన్ని నింపుతుందని తెలుసుకోవాలి.

ఒక టేబుల్ నేల మీద సరిగ్గా నిలబడాలంటే దాని కాళ్లన్నీ ఒకే ఎత్తులో ఉండాలి. ఒక కాలు మూడు అడుగుల ఎత్తు.. మిగిలినవి ఆరడుగుల ఎత్తుంటే కుప్పకూలిపోతుంది. లైఫ్ కూడా అంతే. జీవితాన్ని బ్యాలెన్స్ చేయడంలో 'పిల్లర్స్' పాత్ర తప్పక ఉంటుంది. వీటిని నిరంతరం అభివృద్ధి చేస్తూ బలోపేతం చేయాలి. దృఢమైన స్తంభాలే బలమైన పునాదిని సృష్టిస్తాయని గుర్తుపెట్టుకోండి. అలాగే ఆ స్తంభాలు మన పరిస్థితులకు అనుగుణంగా అభివృద్ధి చెందుతాయి. పాత వాటిని గౌరవిస్తూ కొత్త స్తంభాల చైతన్యానికి విలువ ఇవ్వడంలో తప్పేం లేదు. ఒకానొక సమయంలో మీ స్తంభాలను పరిపూర్ణం చేసేందుకు జీవితకాలం పట్టవచ్చు, కానీ మీరు కోరుకున్న మార్గాన్ని సృష్టించే చర్య మీకు విశ్వాసాన్ని ఇస్తుంది.


బీరుపై మరో అధ్యయనం.. మందుబాబులకు షాక్


Advertisement

Next Story

Most Viewed