బీరుపై మరో అధ్యయనం.. మందుబాబులకు షాక్

by Javid Pasha |   ( Updated:2022-03-10 07:02:04.0  )
బీరుపై మరో అధ్యయనం.. మందుబాబులకు షాక్
X

దిశ, ఫీచర్స్ : ఈ రోజుల్లో బీర్లు తాగడం పెద్ద విషయంగా అనిపించకపోవచ్చు కానీ తాజా అధ్యయనం ప్రకారం డైలీ ఒక బీర్ తాగడం వల్ల మెదడు వయసు రెండేళ్లు పెరుగుతుందని తేలింది. ప్రతిరోజూ తాగే వ్యక్తుల్లో మెదడులోని బూడిద, తెలుపు రంగు పదార్థం పరిమాణం తగ్గిందని జనరల్ నేచర్ కమ్యూనికేషన్స్‌లో ప్రచురించబడిన అధ్యయనం వెల్లడించింది. తక్కువ స్థాయిలో ఆల్కహాల్ వినియోగం(వారానికి కొన్ని బీర్లు లేదా గ్లాసుల వైన్) కూడా మెదడుకు ప్రమాదాన్ని కలిగిస్తుందని కొత్త అధ్యయనం పేర్కొంది. పెన్సిల్వేనియా యూనివర్సిటీ బృందం 36,000కు పైగా పెద్దల నుంచి సేకరించిన డేటా ఆధారంగా తేలికపాటి నుంచి మితంగా ఆల్కహాల్ వినియోగం మెదడు పరిమాణాన్ని తగ్గించడంతో సంబంధాన్ని కలిగి ఉందని కనుగొన్నారు.

రోజుకు ఒక యూనిట్ మాత్రమే తాగే 50 ఏళ్ల వ్యక్తుల మెదడు వయసు.. ఆల్కహాల్ మానేసినప్పటి కంటే ఆరు నెలలు పాతబడినట్లు మెయిల్ ఆన్‌లైన్ నివేదించింది. ఇక రోజుకు రెండు యూనిట్లు(ఒక మధ్య తరహా గ్లాసు బీర్) తాగే మధ్య వయస్కుల మెదడు రెండున్నరేళ్లు వయసు కోల్పోయిందని ఈ డేటా సూచించింది. యూనిట్ల సంఖ్యను రోజుకు నాలుగు వరకు పెంచినట్లయితే అది పదేళ్ల అదనపు వృద్ధాప్యానికి దారి తీసింది. ప్రస్తుతం ఈ అధ్యయనం మద్యం వల్ల కలిగే నష్టాల గురించి కొత్త విషయాలను వెలుగులోకి తెచ్చింది. దీంతో తక్కువ-స్థాయి మద్యపానం ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుందనే వాదనలపై ఈ పరిశోధనలు మరిన్ని ప్రశ్నల్ని లేవనెత్తుతున్నాయి.


జీవితాన్ని బ్యాలెన్స్ చేసే పిల్లర్స్.. కలర్‌ఫుల్ లైఫ్ మీ సొంతం

Advertisement

Next Story

Most Viewed