- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మంత్రి శ్రీనివాసగౌడ్‌కు హై సెక్యూరిటీ
దిశ, తెలంగాణ బ్యూరో : మంత్రిర శ్రీనివాస్‌గౌడ్‌పై హత్యా యత్నానికి కుట్ర జరిగినట్లు పోలీసులు పసిగట్టడం తో ఆయనకు భద్రత పెరిగింది. ఇప్పుడున్న పోలీసు సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. నిత్యం ఆయనకు ఇరవై మంది పోలీసులు ఇకపైన సెక్యూరిటీ కల్పించనున్నారు. ఇందులో గ్రేహౌండ్స్ విభాగానికి చెందిన నలుగురు సాయుధ పోలీసులతో పాటు ఆరుగురు ఇంటెలిజెన్స్ సిబ్బంది కూడా ఉంటారు. వీరికి తోడు పది మంది సాయుధ పోలీసులు కూడా సెక్యూరిటీ గా ఉంటారు. ఇప్పటివరకూ స్టెన్ కార్బైన్ గన్‌లతో భద్రత కల్పించే పోలీసులు ఉండగా ఇప్పుడు సెక్యూరిటీని పెంచడంతో అదనంగా ఎం-44 వెపన్స్ కూడా అందుబాటులోకి రానున్నాయి.
ప్రస్తుతం జెడ్ ప్లస్ కేటగిరీ లో ఉన్న ముఖ్యమంత్రి కి మాత్రమే గ్రేహౌండ్స్ పోలీసులు సెక్యూరిటీ గా ఉన్నారు. మిగిలిన మంత్రులెవరికీ ఈ స్థాయిలో భద్రత లేదు. శ్రీనివాస్‌గౌడ్‌పై హత్యాయత్నం కుట్ర వెలుగులోకి రావడంతో ఇంతటి భారీ స్థాయి భద్రత కలిగిన ఏకైక మంత్రి అయ్యారు. గత ఏడాది ఆగస్టు నుంచి కుట్ర జరుగుతున్నదంటూ పోలీసుల దర్యాప్తులో వెల్లడి కావడంతో ప్రభుత్వం కూడా తగిన భద్రతను కల్పించాలని నిర్ణయించింది.