- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రూ. 2 లక్షల కోట్లకు పైగా రిటైల్ గృహ రుణాలిచ్చిన హెచ్‌డీఎఫ్‌సీ!
ముంబై: ప్రముఖ గృహ రుణాల సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి మార్చి 21 నాటికి రూ. 2 లక్షల కోట్లకు పైగా రిటైల్ హోమ్ లోన్‌లు ఆమోదించినట్టు వెల్లడించింది. ఇది ఒక ఆర్థిక సంవత్సరంలోనే అత్యధిక మని కంపెనీ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. దేశవ్యాప్తంగా ఇళ్ల రుణాలకు భారీగా డిమాండ్ ఏర్పడిందని, తక్కువ వడ్డీ రేట్లు, స్థిరాస్తి ధరల్లో మార్పు లేకపోవడం, ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా గృహ నిర్మాణ రంగం నాలుగున్నర దశాబ్దాల్లో అత్యుత్తమంగా నిలిచిందని హెచ్‌డీఎఫ్‌సీ మేనేజింగ్ డైరెక్టర్ రేణు సుద్ కర్నాడ్ అన్నారు. గతేడాది గృహ రుణాలు కరోనా ముందు నాటి స్థాయికి చేరుకున్నాయి. ఇందులో కొత్తగా ఇళ్లను కొనుగోలు చేసే వారి నుంచి లభించిన మద్దతు కారణంగానే అధిగమించ గలిగాం.
ముఖ్యంగా మెట్రో, నాన్-మెట్రో నగరాల నుంచి ఇళ్ల రుణాల కోసం గిరాకీ ఎక్కువగా ఉంది. అలాగే, సరసమైన ఇళ్ల కొనుగోలు తో పాటు అధిక ధర ఉన్న ఇళ్లను కొనేందుకు కూడా వినియోగదారులు సిద్ధంగా ఉన్నారు. ప్రధానంగా రూ. 50 లక్షల నుంచి రూ. కోటి మధ్య ఇళ్ల కోసం రుణాలు తీసుకుంటున్న వారు పెరిగాయని ఆయన వివరించారు. అంతేకాకుండా కరోనా పరిస్థితుల నేపథ్యంలో సవాళ్లను ఎదుర్కొనేందుకు హెచ్‌డీఎఫ్‌సీ డిజిటల్ కార్యక్రమాలపై దృష్టి సారించిందని, అవి సత్ఫలితాలను ఇచ్చాయని, ఈ కారణంగానే గృహ రుణాల ఆమోదంలో రూ. 2 లక్షల కోట్ల మైలురాయిని చేరుకున్నట్టు సంస్థ వెల్లడించింది.