Breaking: భారీ స్కాం.. జగన్‌పై సంచలన ఆరోపణలు..?

by srinivas |
Breaking: భారీ స్కాం.. జగన్‌పై సంచలన ఆరోపణలు..?
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో భారీ స్కాం గుట్టు రట్టు అయింది. అది వైసీపీ(Ycp) హయాంలో జరిగిందని లోక్‌సభ సాక్షిగా టీడీపీ ఎంపీ లావు శ్రీకృదేవరాయలు(TDP MP Lavu Srikridevarayalu) పూస గుచ్చినట్లు స్పష్టం చేశారు. ‘‘జగన్(Jagan) హయాంలో భారీగా మద్యం కుంభకోణం జరిగింది. జగన్ బంధువు సునీల్ రెడ్డి(Sunil Reddy) ద్వారా దుబాయ్‌కు రూ. 2 వేల కోట్ల విలువైన మద్యం, డబ్బులు తరలించారు. ఒక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ పేరుతో సునీల్ రెడ్డి ద్వారా రూ. 2 వేల కోట్లను దుబాయ్‌కు మళ్లించారు. జగన్ హయాంలో అదాన్ గ్రే సన్, లీలా, జేఆర్ అసోసియేట్స్, పీవీ స్పిరిట్స్ లాంటి 26 కొత్త కంపెనీలు భారీ లాభాలు పొందాయి. రూ.20, 356 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. అయితే బయటకు రాకుండా గోప్యంగా ఉంచారు.’’ అని లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు.



ఢిల్లీ లిక్కర్ స్కాం కన్నా ఇది చాలా పెద్దదని ఎంపీ లావు పేర్కొన్నారు. ‘‘ లిక్కర్ ఉత్పత్తికి ముందే భారీ కుంభకోణానికి పాల్పడ్డారు. జగన్ అధీనంలో ఉన్న సంస్థల ద్వారా మద్యం వ్యాపారాన్ని పూర్తిగా నియంత్రించి ప్రజలను మోసం చేశారు. ప్రముఖ మద్యం బ్రాండ్లను తొలగించారు. నాసిరకంగా ఉన్న కొత్త బ్రాండ్లను రాష్ట్రంలో ప్రవేశ పెట్టారు. నంద్యాల స్పై ఆగ్రో ఇండస్ట్రీస్ డిస్టిలరీలను బలవంతంగా లాక్కున్నారు. కొత్త బినామీ డిస్టిలిరీలను ఏర్పాటు చేశారు. తక్కువ నాణ్యత కలిగి లిక్కర్ ఉత్పత్తి చేయించారు. అలా వేల కోట్ల రూపాయలను జగన్ పార్టీ అనుబంధ వ్యాపారస్తుల చేతిలోకి వెళ్లాయి.’’ అని ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు పేర్కొన్నారు.

Next Story

Most Viewed