- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Haryana: DSP హంతకులను వదిలే ప్రసక్తే లేదు: హోం మంత్రి
దిశ, వెబ్‌డెస్క్: Haryana Home Minister Anil Vij Promises Strict Action Against Mining Mafia| డీఎస్‌పీ సురేందర్ సింగ్‌ను మైనింగ్ మాఫియా హత్య చేసిన సంఘటన దేశమంతా సంచలనంగా మారింది. ఈ ఘటన హర్యానాలో చోటు చేసుకుంది. దీనిపై రాష్ట్ర హోం మంత్రి అనిల్ విజ్ స్పందించారు. హంతకుల్లో ప్రతి ఒక్కరినీ అరెస్ట్ చేస్తామని, ఏవరినీ వదిలే ప్రసక్తే లేదని అన్నారు. 'డీఎస్‌పీని హత్య చేసిన వారిలో ఏఒక్కరినీ విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఈ ఘటనకు తగిన సమాధానం ఇవ్వాలని డీజీపీని ఆదేశించాను. అందుకోసం చుట్టుపక్కల జిల్లాలు సహా పూర్తి పోలీసు బందోబస్తు వినియోగించుకునేందుకు అతడిని పూర్తి హక్కులు ఇచ్చాను' అని అనిల్ తెలిపారు. దీంతో పాటుగా రాష్ట్ర సీఎం మనోహర్ లాల్ ఖత్తర్ కూడా ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని వీలైనంత త్వరగా అదుపులోకి తీసుకోవాలని తెలిపారు. అంతేకాకుండా హతమారిన డీఎస్‌పీ కుటుంబానికి రూ.1 కోటి ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. దాంతో పాటుగా డీఎస్‌పీ కుటుంబీకుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈ దారుణానికి పాల్పడిన నిందితులను ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దని అధికారులకు ఆదేశాలిచ్చారు.
ఇది కూడా చదవండి: కదిలే వాహనంపై ప్రయాణం ప్రమాదకరం.. మరి పుష్అప్‌లు ఓకేనా.. చూడండి!
- Tags
- Haryana