మతమార్పిడి వ్యతిరేక బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

by Mahesh |
మతమార్పిడి వ్యతిరేక బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
X

చండీగఢ్: హర్యానా ప్రభుత్వం కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. మతమార్పిడి వ్యతిరేక బిల్లుకు మంగళవారం హర్యానా అసెంబ్లీ ఆమోదం తెలిపింది. బలవంతంగా, ప్రభావితం చేయడం లేదా ఆకర్షించడం వంటి చర్యలను ఈ బిల్లు వ్యతిరేకిస్తుంది. ఈ బిల్లు ప్రకారం రుజువు చేయాల్సిన బాధ్యత నిందితుడి దేనని పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదు సంవత్సరాల జైలు శిక్ష లేదా రూ.లక్షకు తక్కువ కాకుండా జరిమానా విధించనుంది. ఇప్పటికే ఈ తరహా బిల్లులు హిమాచల్ ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ లో ఆమోదం పొందాయి.

అయితే హర్యానా ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు రాజ్యాంగ వ్యతిరేకమని పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. సమాజంలో మతం పేరుతో విభజించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నమని అన్నారు. బిల్లుపై నిరసన వ్యక్తం చేస్తూ సభను వాకౌట్ చేశారు. బలవంతపు మార్పిళ్లకు ఇప్పటికే శిక్షలు ఉన్నప్పటికీ కొత్త చట్టాన్ని తీసుకు రావాల్సిన అవసరమేంటని హర్యానా అసెంబ్లీ విపక్ష నేత భూపిందర్ సింగ్ హుడా అన్నారు. ఈ బిల్లు ప్రవేశపెట్టడం హర్యానా చరిత్రలో బ్లాక్ చాప్టర్ అని సీనియర్ కాంగ్రెస్ నేత కిరణ్ చౌదరీ ఆరోపించారు.

Advertisement

Next Story