- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాన్‌సూన్ ట్రెక్స్ ప్రారంభించిన గోవా టూరిజం శాఖ!
దిశ, ఫీచర్స్ : గోవా టూరిజం డిపార్ట్‌మెంట్ 2015లో ప్రారంభించిన 'మాన్‌సూన్ ట్రెక్స్' విశేషంగా ఆదరణ పొందాయి. స్థానిక జీవనోపాధిని పెంచే లక్ష్యంతో ఈ ట్రెక్స్ ఆరంభించగా, COVID-19 కారణంగా మార్చి 2020లో మూసేయాల్సి వచ్చింది. రెండేళ్ల తర్వాత జులై 3న గోవా టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్(GTDC) తిరిగి ఈ సేవలు ప్రారంభించింది. వర్షాకాల ప్రయాణాలు సహా పచ్చటి పల్లె వాతావరణాన్ని ఇష్టపడే పర్యాటకులకు ఇవి సరికొత్త అనుభూతి పంచనున్నాయి. ఈ నేపథ్యంలో గోవాలోని అందమైన జలపాతాలకు ట్రెక్కింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం.
గోవా ప్రకృతి అందాలను అన్వేషిస్తూ ఆస్వాదించేందుకు నేచర్ లవర్స్ ఈ సీజన్‌ను అత్యు్త్తమంగా భావిస్తారు. ఇక జీటీడీసీ సైతం ఈ ట్రెక్స్‌ను అన్ని భద్రతా ప్రమాణాలతో నిర్వహిస్తోంది. ప్రతీ వారం ఓ కొత్త ప్రాంతాన్ని, మార్గాన్ని లిస్ట్ అవుట్ చేస్తోంది. జులై 10వ తేదీన సత్తారి తాలూకా, హివ్రేమ్ వద్ద 8 కి.మీ ట్రెక్ ఉండనుంది. ఇది సందర్శకులను సుందరమైన జలపాతాల గుండా తీసుకెళ్తుంది. తోటలు, కొండల మధ్యన నడిపిస్తూ చివరగా ఒక జలపాతానికి తీసుకెళ్తారు. ఈ క్రమంలో జీటీడీసీ శాఖ అధికారులు సందర్శకులకు తోడ్పాటునందిస్తూ ట్రెక్కింగ్‌లో ప్రోత్సహిస్తారు. రెండున్నర గంటల ట్రెక్ తర్వాత స్థానికుల ప్రత్యేక వంటకాలతో భోజనం ఉంటుంది. ఈ విధంగా పర్యాటకంలో లోకల్ కమ్యూనిటీస్‌ను నిమగ్నం చేస్తూ వారికి కూడా అదనపు ఆదాయాన్ని అందించే మార్గాలను కల్పిస్తోంది జీటీడీసీ. ఇక ట్రెక్స్‌లో భాగమైన గైడ్స్ అందరూ GTDC, అటవీ శాఖ ద్వారా శిక్షణ పొందినవారే. పర్యాటకుల వెంట వెళ్లేందుకు ధృవీకరించిన గైడ్స్ మాత్రమే అనుమతించబడతారు.
గుర్తుంచుకోవలసిన విషయాలు:
* ట్రెక్కర్స్ అదనపు జత దుస్తులను వెంట తీసుకెళ్లాలి
* వర్షాకాలం కాబట్టి రెయిన్‌వేర్స్‌తో పాటు మంచి ట్రెక్కింగ్ షూస్ అవసరం.
* ప్రతి ట్రెక్కర్ ఒక సొంత వాటర్ బాటిల్(ప్లాస్టిక్ బాటిల్ తీసుకెళ్లకూడదు) తీసుకెళ్లాలి.
* పక్షులను చూడటంలో ఆసక్తి ఉన్న ట్రెక్కర్స్ బైనాక్యులర్స్ తీసుకెళ్లవచ్చు.
* ట్రెక్కింగ్‌లో ఉన్నప్పుడు ధూమపానం, మద్యపానం అనుమతించరు.
* రిజిస్ట్రేషన్ ఫీజు ఒక్కో వ్యక్తికి రూ. 1000/-(భోజనం సహా ముందుగా నిర్ణయించిన పాయింట్స్ నుంచి పికప్ చేసుకుంటారు)
* ఆదివారం మాత్రమే ట్రెక్కింగ్స్ నిర్వహించనున్నారు.
* +91- 9422057704 లేదా +91- 8379022215 నంబర్‌లో సంప్రదించి రిజిస్ట్రేషన్ నమోదు చేసుకోవచ్చు లేదా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్ కూడా చేసుకోవచ్చు.