నాకు కలొచ్చింది.. వెళ్లి చూస్తే నిజంగానే బెడ్‌పైన అతని పక్కలో ఆమె..

by S Gopi |   ( Updated:2022-03-17 04:02:55.0  )
నాకు కలొచ్చింది.. వెళ్లి చూస్తే నిజంగానే బెడ్‌పైన అతని పక్కలో ఆమె..
X

దిశ, వెబ్ డెస్క్: మొదటగా తనకొచ్చిన కలను ఓ యువతి టేక్ ఇట్ ఈజీగా తీసుకుంది. ఆ కల రోజూ వస్తుండడంతో నిద్రపోయేది కాదు. రోజూ తనకొస్తున్న కల నిజమా కాదా? అని చెక్ చేయాలనుకుంది. వెంటనే అక్కడికి వెళ్లి చూసింది. ఆ తర్వాత ఒక్కసారిగా షాకైంది. రోజూ తనకొస్తున్న కల నిజమయ్యింది. ఆ విషయాన్ని సోషల్ మీడియాలో ఆ యువతి పేర్కొంటూ ఆవేదన వ్యక్తి చేసింది. రాబోయే ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి జాగ్రత్తగా ఉండాలంటూ అందులో పేర్కొన్నది. పూర్తి వివరాల్లోకి వెళితే.. బ్రిటన్ కు చెందిన ఓ యువతికి ఓ యువకుడు పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిపోయింది. అయితే, వారిద్దరూ వేర్వేరు ప్రాంతాల్లో ఉండేవాళ్లు. ఈ క్రమంలో ఒకరోజూ ఆ యువతికి కల వచ్చింది. తన బాయ్ ఫ్రెండ్ వేరే యువతితో ఉన్నట్లుగా కల వచ్చింది. మొదటగా అంతగా సీరియస్ గా తీసుకోలేదు. అయితే, ఆ కల రోజూ వస్తుండడంతో సీరియస్ గా తీసుకుంది. తనకు వస్తున్న కల వాస్తవమా? కాదా? అనేది చెక్ చేయాలనుకుంది. అనుకున్న విధంగా ఓ రోజు ఉదయం 4 గంటలకు తన బాయ్ ఫ్రెండ్ రూంకు వెళ్లింది. అప్పటికే తన వద్ద ఉన్న తాళంతో డోర్ ఓపెన్ చేసింది. ఆ తర్వాత రూంలోకి వెళ్లి బెడ్ రూంలోకి చూసి షాకయ్యింది. తన బాయ్ ఫ్రెండ్ మరో యువతితో కలిసి నిద్రపోతూ కనిపించాడు. వెంటనే ఆ యువతి తన బాయ్ ఫ్రెండ్ కు బ్రేకప్ చెప్పింది. ఈ విషయాన్నంతా కూడా సోషల్ మీడియాలో షేర్ చేసి.. ఎవరికైనా ఇలాంటి విషయాల్లో ముందుగా తప్పు జరుగుతున్నట్లుగా అనిపిస్తే జాగ్రత్తగా ఉండాలంటూ అందులో పేర్కొన్నది.

Advertisement

Next Story