ఫెడరల్ వ్యవస్థను కాదని కేంద్రం పరిపాలన.. గద్దర్

by Vinod kumar |
ఫెడరల్ వ్యవస్థను కాదని కేంద్రం పరిపాలన.. గద్దర్
X

దిశ, అల్వాల్: కేంద్రం ఫెడరల్​ వ్యవస్థను కాదని పరిపాలన చేస్తుందని ప్రజా గాయకుడు గద్దర్ అన్నారు. సోమవారం అల్వాల్ మండల కార్యాలయం వద్ద జరిగిన రైతుల ధర్నాకు సంఘీభావంగా వచ్చి ధర్నాలో కూర్చున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం ఫెడరల్​వ్యవస్థ యొక్క మూలసూత్రాలను కాదని పరిపాలన చేయడం మూలంగానే రాష్ట్రాలకు కేంద్రానికి తగాద వస్తుందని తెలిపారు. దానితో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇప్పుడు ముఖ్యంగా రైతులు ధాన్యం విషయంలో బాధపడుతున్నారు.


రాష్ట్రం కొనమని, కేంద్రం కొనను అని పంచాయితి పెట్టుకుంట్టున్నారు. దీనికంతటికి కారణం రాజ్యాంగ చట్టాలను కాదనుకోవడం మూలంగా తలెత్తినవే అన్నారు. నీకు నాకు మనందరికీ అన్నం పెట్టే రైతుల ఇబ్బందులు పోవాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. రైతు కేంద్రంగా ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలని కోరారు. అందుకే వారికి మద్దతుగా ధర్నాకు వచ్చానని గద్దర్​ తెలిపారు.

ధాన్యం కొనే వరకు మేం నిద్రపోం.. మిమ్మల్ని నిద్రపోనివ్వం.. ఎమ్మెల్యే హన్మంతరావు

రాష్ట్ర వ్యాప్త ధర్నాలో భాగాంగ మండల కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నాకు హాజరైన ఎమ్మెల్యే హన్మంతరావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు కావలసిన నీరు, కరెంట్ సంవృద్దిగా ఇవ్వడంతో రైతులు సంతోషంగా పంటలు పండిస్తే.. కేంద్రం ధాన్యం కొనకుండా ఇబ్బందులు పెట్టడం బాధాకరమన్నారు.


గౌరవ ప్రధాన మంత్రి రైతుల బాధలను గమనించి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్​ చేశాడు. తెలంగాణ రైతులు పండించిన ప్రతి గింజ కొనే వరకు మేము నిదురపొము.. మిమ్ముల నిదుర పొనివ్వమని అన్నారు. ఈనెల 11న ఢిల్లీకి వస్తున్నామని అక్కడ మా తెలంగాణ రైతుల బాధలు వినిపిస్తామని తెలిపారు. తక్షణమే కేంద్రం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ధాన్యం కొనాలని కోరారు.

Advertisement

Next Story