నేడు బడ్జెట్‌పై సాధారణ చర్చ.. ఫస్ట్ అవర్‌లోనే సీఎం కీలక ప్రకటన

by GSrikanth |   ( Updated:2022-03-09 03:09:23.0  )
నేడు బడ్జెట్‌పై సాధారణ చర్చ.. ఫస్ట్ అవర్‌లోనే సీఎం కీలక ప్రకటన
X

దిశ, తెలంగాణ బ్యూరో: బడ్జెట్‌పై బుధవారం సాధారణ చర్చ జరుగనుంది. ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రశ్నోత్తరాలు, జీరో అవర్‌కు అవకాశం ఇవ్వలేదు. ఈ నెల 7న జీరో అవర్, క్వశ్చర్ అవర్ ఉంటుందని స్పీకర్ ప్రకటించినప్పటికీ దానిని రద్దు చేశారు. అసెంబ్లీ ప్రారంభం కాగానే సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేయనున్నారు. అనంతరం బడ్జెట్‌పై చర్చ నిర్వహిస్తారు. ఆర్థిక శాఖ మంత్రి హరీశ్, అనంతరం బాల్కసుమన్‌తో పాటు మరో ఇద్దరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడనున్నారు. కాంగ్రెస్ నుంచి ఒక ఎమ్మెల్యే, ఎంఐఎం నుంచి ఒకరు బడ్జెట్‌పై మాట్లాడతారు. సీఎం లేదా ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్‌పై జరిగిన చర్చకు సమాధానమిస్తారు. సోమవారం బీఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను బుధవారం సభ ముందు పెట్టనున్నారు.

Advertisement

Next Story