కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ

by samatah |   ( Updated:2022-03-22 10:52:29.0  )
కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
X

దిశ, సంగారెడ్డి : నిరుద్యోగులైన యువతీ యువకులు పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, శిక్షణ‌కు ఆన్లైన్‌లో పేరు నమోదు చేసుకోవాలని జిల్లా ఎస్‌పీ రమణ కుమార్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో భారీ ఎత్తున భర్తీచేయనున్న పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ నియామకాల గురించి నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాలో నిరుద్యోగులైన యువతి యువకులను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. శిక్షణ కోసం ఈనెల 22వ తేదీ నుంచి 27వ తేదీ వరకు అర్హులైన యువతి యువకులు పూర్తి వివరాలను ఈ ఆన్లైన్ లింక్‌లో https://www.jotform.com/build/220793184688469 దరఖాస్తు చేయాలన్నారు. ఆన్లైన్ లింక్ 27వ తేదీ రాత్రి 9 గంటల వరకు అందుబాటులో ఉంటుందన్నారు.

ఆన్లైన్‌లో పేర్లు నమోదు చేసుకున్న వారందరికీ అవసరాన్ని బట్టి స్క్రీనింగ్ టెస్ట్ తమ తమ సబ్ డివిజన్ సంగారెడ్డి, పటాన్ చెరు, జహీరాబాద్, నారాయణఖేడ్‌లలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అందులో క్వాలిఫై అయిన యువతీ, యువకులకు ఉచిత పోలీస్ శిక్షణ అందించడం జరుగుతుందని, పురుషులు167.6 సెం.మీ, మహిళలు 152.5 సెం.మీ. ఎత్తు ఉన్నవారు మాత్రామే దరఖాస్తు చేయాలని సూచించారు. శిక్షణ తరగతులు ఎక్కడ, ఎప్పుడు అన్న విషయాన్ని తరువాత పత్రిక ప్రకటనలో తెలియజేయడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సూచించారు.

Advertisement

Next Story