కేసీఆర్‌కు చేతకాక ధర్నాలు.. ఇలాంటివి ఎక్కడైనా చూసామా?: బీజేపీ నేత ఫైర్

by Manoj |   ( Updated:2022-04-08 13:00:48.0  )
కేసీఆర్‌కు చేతకాక ధర్నాలు.. ఇలాంటివి ఎక్కడైనా చూసామా?: బీజేపీ నేత ఫైర్
X

దిశ, మెదక్: సీఎం కేసీఆర్‌కు చేత కాకపోవడంతోనే మంత్రులు ఎమ్మెల్యేలతో రోడ్డెక్కి ధర్నా చేస్తున్నారని బీజేపీ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం మెదక్‌లో నిర్వహించిన బీజేపీ రైతు సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ధాన్యం కొనుగోలు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రోడ్డెక్కి ధర్నాలు చేయడం వింతగా ఉందన్నారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ ఓవైపు మంత్రులు ఎమ్మెల్యేలు అధికార పార్టీకి చెందిన యంత్రాంగం రోడ్డెక్కి నిరసనలు చేయడమేమిటని ప్రశ్నించారు.

కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయొద్దని ఎక్కడ చెప్పింది అని ప్రశ్నించారు. ఖరీఫ్ సీజన్‌లో రైతులు పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేసిన విషయం కేసీఆర్‌కు తెలియదా అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులతో పాటు మిల్లర్లతో ఆడుకుంటున్నారు. రైతులను ఇబ్బంది పెట్టిన ఏ ప్రభుత్వం బాగు పడినట్లు చరిత్రలో లేదన్నారు. ఈ విషయాన్ని గుర్తెరిగి కేసీఆర్‌ ఇకనైనా రాజకీయాలు మాని రైతాంగానికి మేలు చేసే విధంగా పాలన చేయాలని సూచించారు.

రైతుబంధు ఇస్తున్నామని చెబుతూ రైతులకు సబ్సిడీ ద్వారా కేంద్ర ప్రభుత్వం అందజేసే వ్యవసాయ పరికరాలను పూర్తిగా అందకుండా చేస్తుందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం దేశంతో పాటు రైతుల ప్రయోజనాల కోసం ఎప్పుడు పాటు పడుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి కేంద్రంపై కొనుగోలు కేంద్రాల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రాజకీయం చేస్తోందని విమర్శించారు ఇకనైనా ఈ విధానం మార్చుకోవాలని సూచించారు. ఈ సదస్సులో మాజీ మంత్రి బాబూమోహన్, మాజీ ఎమ్మెల్యేలు విజయ పాల్ రెడ్డి నందీశ్వర్ గౌడ్ వాసు రెడ్డి మెదక్, సంగారెడ్డి సిద్దిపేట్ పార్టీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, నరేందర్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి తో పాటు బిజెపి నాయకులు రైతులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed