తరచూ మీ బాడీలో మంట, వాపుకు కారణమయ్యే ఫుడ్స్?

by Anjali |
తరచూ మీ బాడీలో మంట, వాపుకు కారణమయ్యే ఫుడ్స్?
X

దిశ, వెబ్‌డెస్క్: జీవన శైలిలో మార్పుల కారణంగా ప్రస్తుత రోజుల్లో చాలా మంది అనారోగ్య సమస్య(health problem)ల బారిన పడుతున్నారు. ప్రాసెస్ చేసిన మాంసాలు, శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు(Carbohydrates), ఆల్కహాల్(alcohol) వంటి ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల వాపు(swelling) వస్తుంది. దీర్ఘకాలిక మంట మీ జీవక్రియ రుగ్మతలు(Metabolic disorders) అండ్ హృదయ సంబంధ వ్యాధుల(Cardiovascular diseases) ప్రమాదాన్ని పెంచుతుంది.

అయితే బాడీలోకి మనం తీసుకునే ఫుడ్ ద్వారా బ్యాక్టీరియా(Bacteria), వైరస్‌లు(viruses), రసాయనాలు(chemicals) ప్రవేశించినప్పుడు వాపు, మంట వస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీనినే ఇన్ఫమేషన్ అని పిలుస్తారు. ఈ ప్రాబ్లమ్ బాడీకి హాని కలిగిస్తుంది. కీళ్ల నొప్పులు(Joint pains), ఆర్థరైటిస్(Arthritis) వంటి సమస్యల్ని తెచ్చిపెడుతుంది. మరీ ఏఏ ఆహారాలు తీసుకుంటే వాపు, మంటకు కారణమవుతాయో ఇప్పుడు క్లారిటీగా చూద్దాం..

అధి చక్కెర ఉపయోగిస్తే బాడీలో ప్రొఇన్షమేటరీ మాలిక్యూల్స్(Proinflammatory molecules) ఉత్పత్తి పెరిగి..శరీరంలో కొవ్వు రావడానికి దారితీస్తుంది. అలాగే స్నాక్స్(Snacks), ఫాస్ట్ ఫుడ్(fast food), కూడా నొప్పి, ఇన్ఫ్లమేషన్‌కు ప్రేరేపిస్తాయి. అంతేకాకుండా శరీర భాగాల్లో దుర్గంధం నొప్పి కలిగించే ఆక్సిడేటివ్ స్ట్రెస్‌(Oxidative stress)ను వ్యాప్తి చేస్తాయి.

అలాగే కాఫీ(Coffee) లేదా ఆల్కహాల్(alcohol) ఎక్కువగా వాడడం వల్ల బాడీలో ఇన్ఫమేటరీ రసాయనాల్ని(Inflammatory chemicals) పెంచేందుకు దారితీస్తుంది. అధిక సోడియం(Sodium) ఎక్కువగా వాడినా రక్తపోటు ప్రమాదం(Risk of hypertension) పెరుగుతుంది. ప్రాసెస్ చేసిన ఆహారాలు(Processed foods), రెడీ మీట్, ప్యాక్ చేసినవి ఎక్కువగా సోడియం కలిగి ఉంటాయి.

సోయా ఆయిల్(Soy oil), బొప్పాయి(Papaya), పాల(milk)తో రెడీ చేసిన పదార్థాల్లో ఒమెగా -6 ఫ్యాటీ ఆమ్లాల(Omega-6 fatty acids)ను ఎక్కువగా కలిగి ఉంటాయి. ఒమెగా -3 ఫ్యాటీ ఆమ్లాల కంటే ఎక్కువ మోతాదులో ఉపయోగిస్తే బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. రైస్(Rice), బార్లీ(barley), గోధుమ, గ్లూటెన్(wheat) వంటివి పడని వారికి కూడా శరీరంలో ఇన్ఫ్లమేషన్ పెరిగే ప్రమాదం ఉంది.

అంతేకాకుండా పిజ్జా(Pizza), తెల్ల రొట్టె(white bread),పాస్తా వంటి వాటిలో కార్బోహైడ్రేట్లు బాడీలో గ్లైసిమిక్ ఇండెక్స్(Glycemic index) ను పెంచుతాయి. ఇవి షుగర్ లెవల్స్ ను పెంచేందుకు కారణమవుతాయి. ప్రాసెస్ చేసిన మాంసాలలో ట్రాన్స్ ఫ్యాట్స్(Trans fats), సోడియం(sodium), ప్రాసెస్ చేసే రసాయనాలు ఉండి బాడీని ఇన్ఫ్లమేషన్‌కు గురి చేస్తుంది. అలాగే మకన్, పాలు, చీజ్ వంటివి కూడా ఇన్ఫ్లమేషన్‌ను పెంచేందుకు దారితీస్తుంది. ఈ కారణంగా మీ బాడీలో మంట, వాపు వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed