వైద్య వృత్తి సేవ లాంటిది..కమిట్మెంట్ తో పని చేయాలి

by Naveena |
వైద్య వృత్తి సేవ లాంటిది..కమిట్మెంట్ తో పని చేయాలి
X

దిశ, మర్రిగూడ : సమాజంలో వైద్య వృత్తి సేవ లాంటిదని, వైద్య సిబ్బంది రోగులకు వైద్య సేవలు అందించాలని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని సిహెచ్ సి ప్రభుత్వ ఆసుపత్రిలో 70 లక్షల వ్యయంతో డయాలసిస్ కేంద్రాన్ని శుక్రవారం ఎమ్మెల్యే ప్రారంభించారు . 30 పడకల ఆసుపత్రి పరిధిలో ఉన్న ప్రజలకు ఎక్కువగా ఫ్లోరైడ్ నీళ్లు తాగడం వలన రోజురోజుకు కిడ్నీ పేషెంట్లు ఎక్కువవుతున్న నేపథ్యంలో..ఈ డయాలసిస్ కేంద్రం కిడ్నీ పేషెంట్లకు ఎంతో మేలు చేస్తుందని అన్నారు. మర్రిగూడ మండల సమీప గ్రామాల కిడ్నీ పేషెంట్లకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. పేషంట్ల తాకిడిని బట్టి 24 గంటలు డయాలసిస్ కేంద్రం పనిచేయాలని, వైద్య సిబ్బంది షిప్టుల వారిగా పని చేయాలన్నారు. వైద్యం వృత్తి అనేది సేవలంటిదని వైద్య సిబ్బంది కమిట్మెంట్తో పని చేయాలని కోరారు. గ్రామాల వారీగా కిడ్నీ పేషంట్ల జాబితాను తీసుకొని క్రమం తప్పకుండా రోగులకు వైద్య సేవలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో నల్గొండ డిఎంహెచ్ఓ పుట్ట మధు, డి సి హెచ్ డాక్టర్ మాతృ, మర్రిగూడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ శంకర్ నాయక్ ఆస్పత్రి సిబ్బంది, నాంపల్లి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వెన్నమనేని రవీందర్రావు, మర్రిగూడ మాజీ సర్పంచ్ మాస శేఖర్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రాందాస్ శ్రీనివాస్ స్థానిక మండల నాయకులు పాశం సురేందర్ రెడ్డి, మేటర్ యాదయ్య ,వెంకటంపేట బాలయ్య, పులిమామిడి నరసింహారెడ్డి, కళ్లెం జైపాల్ రెడ్డి, అయితే గోని రేణుక వెంకట్ మాజీ సర్పంచులు ఎంపీటీసీలు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed