Rajinikanth: రజినీకాంత్ సూపర్ హిట్ మూవీ రీ-రిలీజ్.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్

by Hamsa |
Rajinikanth: రజినీకాంత్ సూపర్ హిట్ మూవీ రీ-రిలీజ్.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్
X

దిశ, సినిమా: గత కొద్ది రోజుల నుంచి ఇండస్ట్రీలో రీ-రిలీజ్ ట్రెండ్ కొనసాగుతోంది. ఇప్పటికే స్టార్ హీరోల సినిమాలను మరోసారి థియేటర్స్‌లో విడుదల చేసి ఫ్యాన్స్ ఖుషీ చేస్తున్నారు. చిన్న చిత్రాలు కూడా రీరిలీజ్‌లో పుంజుకుని భారీ కలెక్షన్లు రాబడుతూ బాక్సాఫీసును షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) బ్లాక్ బస్టర్ హిట్ ‘నరసింహా’ రీ రిలీజ్ కానుందని సమాచారం.

1999లో కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో శివాజీ గణేశన్(Shivaji Ganesan), సౌందర్య, నాజర్, అబ్బాస్, రమ్యకృష్ణ(Ramya Krishna) కీలక పాత్రల్లో నటించారు.అయితే ఇది రజినీకాంత్ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆగస్టు 19న ‘నరసింహా’ మరోసారి థియేటర్స్‌లోకి రానున్నట్లు సమాచారం. ఈ విషయం డైరెక్టర్ స్పందించి క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed