పరశురామావతారంలో పర్ణశాల రామయ్య

by Sridhar Babu |
పరశురామావతారంలో పర్ణశాల రామయ్య
X

దిశ,దుమ్ముగూడెం : పర్ణశాల దేవస్థానంలో ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి.‌ ఒకవైపు ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలు జరుగుతుండడంతో దుమ్ముగూడెం మండల వ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటుంది. మధ్యాహ్నం ఉత్సవాల్లో ఆరో రోజైన ఆదివారం పర్ణశాల సీతారామచంద్ర స్వామి వారు పరశురామావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ నేపథ్యంలో ఉదయాన్నే సుప్రభాతం పలికి తరువాత నామార్చన చేసిన అర్చకులు అనంతరం ఉత్సవమూర్తులను పరశురామవతారంలో అలంకరించారు. పరశురామావతారంలో ముస్తాబైన పర్ణశాల రామచంద్ర మహాప్రభుని ఆలయ ఆవరణంలో ఆసీనులు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో పరశురామవాతరంలో ఉన్న రామయ్యను దర్శించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు.

సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా సుబ్రహ్మణ్యం, నాగభూషణ శర్మ వారిచే హరికథ కాలక్షేపం, పరశురామవతార విశిష్టతను వివరించారు. ధర్మాన్ని రక్షించేందుకు జమదాగ్ని మహర్షి కుమారుడిగా పరశురాముడి రూపంలో విష్ణుమూర్తి జన్మించినట్లు వివరించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భద్రాచలం పట్టణానికి చెందిన భవ్య శ్రీ శిష్య బృందం చేసిన కూచిపూడి నృత్యాలు భక్తులను అలరించాయి. అనంతరం కోలాటం, భజనల మధ్య వేదమంత్రోచ్ఛరణలు, మంగళ వాయిద్యాల నడుమ తిరువీధి సేవలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో ఆలయ ఇంచార్జి అనిల్ కుమార్, ముఖ్య అర్చకులు శేషం కిరణ్ కుమారాచార్యులు, భార్గవాచార్యులు, వేదపండితులు నరసింహాచార్యులు, నలదీగల నరసింహాచార్యులు, వెంకటాచార్యులు, భారద్వాజాచార్యులు, శివ, రాము తదితర సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed