ఇదే సరైన సమయం.. ఆప్ ను ఢిల్లీ నుంచి తొలగించిన ఢిల్లీ భవిష్యత్తు మార్గం వేయండి: ప్రధాని మోడీ

by Mahesh |
ఇదే సరైన సమయం.. ఆప్ ను ఢిల్లీ నుంచి తొలగించిన ఢిల్లీ భవిష్యత్తు మార్గం వేయండి: ప్రధాని మోడీ
X

దిశ, వెబ్ డెస్క్: భారత రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల(Delhi Assembly Elections)కు నోటిఫికేషన్(Notification) వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు బీజేపీ(BJP) పార్టీ ఈ సారి గట్టి ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఈ క్రమంలోనే 29 మంది అభ్యర్థులతో కూడా జాబితాను విడుదల చేసిన ఆ పార్టీ ఈ రోజు ఢిల్లీలో భారీ ఎన్నికల సభను ఏర్పాటు చేసింది. ఈ సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రధాని మోడీ(Prime Minister Modi) మాట్లాడుతూ.. ప్రపంచంలోనే ఉత్తమ నగరంగా ఢిల్లీ(Delhi)ని తీర్చిదిద్దగలిగే సత్తా బీజేపీ(BJP)కి మాత్రమే ఉందని.. ఢిల్లీ ఉజ్వల భవిష్యత్తు కోసం బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా కోరారు. అలాగే గత 25 ఏళ్లలో రెండు, మూడు తరాల యువతరం ఢిల్లీలో ఎదిగిందని.. రాబోయే 25 ఏళ్లు భారతదేశ భవిష్యత్తుకు, ఢిల్లీ భవిష్యత్తుకు అత్యంత కీలకం అన్నారు. పాతికేళ్లలో దేశం 'వికసిత్ భారత్('Vikasit India)గా రూపొందనుందని.. 'ఆప్‌దా'ను ఢిల్లీ నుంచి తొలగించి ప్రజల హృదయాలను గెలుచుకునేందుకు ఇదే తగిన సమయం అని 'బీజేపీ పరివర్తన యాత్ర(BJP Parivartana Yatra)లో ప్రధాని మోడీ పిలుపునిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed