Gavaskar : నేను భారతీయుడననే పిలవలేదేమో : గవాస్కర్ ఆగ్రహం

by Y. Venkata Narasimha Reddy |
Gavaskar : నేను భారతీయుడననే పిలవలేదేమో : గవాస్కర్ ఆగ్రహం
X

దిశ, వెబ్ డెస్క్ : ఆస్ట్రేలియా ఇండియా (AUS vs IND) మధ్య జరిగిన బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ (Border - Gavaskar Trophy) బహుకరణ సమయంలో తాను మైదానంలో అందుబాటులోనే ఉన్న ఆహ్వానించకపోవడాన్ని క్రికెట్ లెజండ్ గవాస్కర్ (Sunil Gavaskar)తీవ్రంగా తప్పుబట్టారు. ఐదు మ్యాచ్ ల సిరీస్ లో ఆస్ట్రేలియా 3-1 తేడాతో ట్రోఫీని కైవసం చేసుకుంది. సిరీస్ లో ఆఖరిదైన సిడ్నీ టెస్టులో అసీస్ విజయం అనంతరం ట్రోఫీని అలెన్ బోర్డర్ చేతుల(Allen Border's hands) మీదుగా ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ స్వీకరించాడు. అయితే క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ను ఆహ్వానించకుండానే.. బోర్డర్ చేతుల మీదుగా ట్రోఫీ ప్రదానం చేయించడం ఇప్పుడు విమర్శలకు దారితీసింది. దీనిపై స్పందించిన గవాస్కర్ నేను కేవలం భారతీయుడినే కాబట్టి నన్ను ట్రోఫీ బహుకరణకు పిలవలేదేమోనని నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అయినందునా.. నా స్నేహితుడు బోర్డర్ తో కలిసి మేమిద్ధరం ఇస్తే బాగుంటుందని అనిపించిందని గవాస్కర్ అభిప్రాయపడ్డారు. తనకు ఆహ్వానం లేకపోవడం నిరుత్సాహానికి గురి చేసిందని వ్యాఖ్యానించాడు. కాగా ఆసీస్ కెప్టెన్ కు ట్రోఫీని ఇస్తున్న సమయంలో మైదానంలోనే గవాస్కర్ వ్యాఖ్యానం చేస్తూ ఉండటం గమనార్హం.

బోర్డర్ -గవావస్కర్ ట్రోఫీని వరుసగా నాలుగుసార్లు భారత్ దక్కించుకుంది.ఆసీస్ సొంతం చేసుకుంది. పదేళ్ల తర్వాత తిరిగి ఆసీస్ కైవసమైంది. ఈ సందర్భంగా “నేను ఇక్కడే ఉన్నా. ఆస్ట్రేలియా సిరీస్ ను గెలవడం నాకు ఇబ్బందికరం కాదని.. వారు బాగా ఆడారు కాబట్టే విజయం సాధించారని గవాస్కర్ చెప్పుకొచ్చారు. కానీ ట్రోఫీని బోర్డర్ తో కలిసి నేను కూడా అందిస్తే బాగుండేదన్నారు. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు నిర్వాహకులు వచ్చి ట్రోఫీ అందజేతపై తమ అభిప్రాయం తెలిపారని, మ్యాచ్ లో భారత్ గెలవకపోయినా.. మ్యాచ్ డ్రా అయినా నేను ట్రోఫీ ప్రదానోత్సవానికి అవసరం లేదన్నారని దీంతో తాను నిరుత్సహానికి గురయ్యానని గవాస్కర్ పేర్కొన్నారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రదానోత్సవానికి గవాస్కర్ ను పిలవకుండా అవమానించారంటూ భారత క్రీడాభిమానులు మండిపడుతున్నారు. మైదానంలోనే కాదు..ఇలాంటి సమయాల్లోనూ అసీస్ తీరు అభ్యంతకరంగా ఉందంటూ నెటిజన్లు విమర్శలు చేస్తు్న్నారు.

Advertisement

Next Story