- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
2025 నూతన సంవత్సర దిశ క్యాలెండర్ ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే..
దిశ, తాడ్వాయి : పత్రిక రంగంలో ఒక కొత్త ఒరవడితో ఎప్పటి వార్తలు అప్పుడే ప్రజలకు అందిస్తూ ట్రెండ్ సెటర్ గా దిశ పత్రిక నిలిచిందని ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్మోహన్ అన్నారు. ఆదివారం హైదరాబాద్ లోని ఎమ్మెల్యే కార్యాలయంలో దిశ 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ఆయన చేతులు మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో మంచి ఆదరణ చూరగొన్న దిశ పత్రిక యాజమాన్యానికి ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
దిశ ప్రత్యేకత ఏంటంటే అన్ని పత్రికల కంటే భిన్నంగా కచ్చితమైన వార్తలు ప్రచురిస్తూ డైనమిక్ ఎడిషన్ రూపంలో పూర్తి సమాచారంతో వార్తలను అందిస్తూ ట్రెండ్ సెటర్ గా నిలిచిందని ఆయన అన్నారు. మునుముందు ఈ సమాజానికి మరింత సేవ చేస్తూ అభివృద్ధి పథంలో దూసుకు వెళ్లాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో శంకర్ గారి నరేష్, తూర్పు సందీప్, రంగ భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.