- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Dil Raju: హోంశాఖ ముఖ్య కార్యదర్శితో దిల్ రాజు భేటీ
దిశ, డైనమిక్ బ్యూరో: హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా (Ravi Guptu)తో తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (Telangana Film Development Corporation) చైర్మన్, ప్రొడ్యూసర్ దిల్ రాజ్ (Dil Raj) భేటీ అయ్యారు. థియేటర్ల లైసెన్స్ లు పునరుద్ధరణ సులభతరం చేయాలన్న అంశంతో పాటు సినీ పరిశ్రమలో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యకలాపాలపై ఈ సందర్భంగా వీరు చర్చిస్తున్నారు. ఈ భేటీలో దిల్ రాజుతో పాటు తెలంగాణ ఫిల్మ్ చాంబర్ అధ్యక్షడు సునీల్ నారంగ్, పలువురు ఎగ్జిబిటర్లు హాజరయ్యారు. కాగా ఇటీవలే పలువురు సినిమా ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ భేటీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సినిమా వాళ్లతో సెటిల్మెంట్ చేసుకుని ఇప్పుడు ఏం మాట్లాడట్లేదని ఆరోపించారు. కేటీఆర్ (KTR) వ్యాఖ్యలపై స్పందించిన దిల్ రాజ్ చిత్ర పరిశ్రమను వివాదాల్లోకి లాగొద్దని, రాజకీయాలను ఆపాదించవద్దని కోరారు. ఈ క్రమంలో ఇవాళ హోంశాఖ ముఖ్య కార్యదర్శితో దిల్ రాజ్ సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.