మహిళల విద్యకు సావిత్రిబాయి పూలే కృషి మరువలేనిది: మంత్రి సవిత

by Jakkula Mamatha |   ( Updated:2025-01-03 09:58:55.0  )
మహిళల విద్యకు సావిత్రిబాయి పూలే కృషి మరువలేనిది: మంత్రి సవిత
X

దిశ,వెబ్‌డెస్క్: మహిళల విద్య కోసం సావిత్రిబాయి పూలే(Savitri Bai Phule) చేసిన సేవలు స్ఫూర్తిదాయకమని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత(Minister Savita) తెలిపారు. ఈ క్రమంలో నేడు(శుక్రవారం) సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భంగా తాడేపల్లి(Tadepalli)లోని తన క్యాంపు కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి మంత్రి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ.. భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలైన సావిత్రిబాయి పూలే మహిళా, బాలికల విద్య కోసం ఎంతో కృషి చేశారన్నారు. దేశంలోనే మొట్టమొదటి బాలిక పాఠశాలను ఆమె నెలకొల్పరన్నారు. విద్యతోనే మహిళలకు గౌరవం లభిస్తుందని నమ్మిన వ్యక్తి అని అన్నారు.

మహిళల విద్య(Women's Education) కోసం సావిత్రిబాయి పూలే చేసిన సేవలను గుర్తిస్తూ.. ఆమె జయంతిని జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. సామాజిక సంస్కర్తగా, రచయితగా స్త్రీల హక్కుల కోసం పోరాడిన ధీశాలి అని కొనియాడారు. చివరి క్షణం వరకూ నమ్మిన సిద్ధాంతాల కోసం అలుపెరగని పోరాటం చేసిన యోధురాలన్నారు. వితంతు వివాహాలు జరిపిన మహోన్నతురాలు సావిత్రీబాయి పూలే అని, తన భర్త జ్యోతిరావు పూలే అడుగుజాడల్లో నడుస్తూ సామాజిక సేవలో కొనసాగారని మంత్రి సవిత తెలిపారు. సావిత్రిబాయి పూలే పోరాట స్ఫూర్తి నేటి యువతకు ఆచరణీయమన్నారు..

Advertisement

Next Story

Most Viewed