- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
PM Modi: ఢిల్లీ ప్రజల పదేళ్లను వృథా చేశారు.. ఆప్ ప్రభుత్వంపై మోడీ విమర్శలు
దిశ, నేషనల్ బ్యూరో: ఆమ్‌ఆద్మీ(APP) ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) విమర్శలు గుప్పించారు. ఆప్(దా) (విపత్తు) ఢిల్లీ ప్రజల పదేళ్లను వృథా చేసిందని అన్నారు. ఢిల్లీలోని రోహిణి(Rohini)లో జరిగిన బీజేపీ ర్యాలీలో మోడీ పాల్గొని ప్రసంగించారు. 'భారత్ మండపం, యశోభూమి, కర్తవ్య పథం గురించి ఢిల్లీ మొత్తం గర్విస్తోంది. ఆప్(దా) నేతలు ఢిల్లీ ప్రజల పదేళ్లను వృథా చేశారని నేను బాధపడ్డా. ట్రాఫిక్ జామ్‌ల కారణంగా ఢిల్లీలోని చాలా ప్రాంతాలకు క్యాబ్‌లు, ఆటోలు వెళ్లేందుకు నిరాకరిస్తున్నాయి. కాగ్ నివేదిక ఆధారంగా 'శీష్ మహల్'పై చేసిన ఖర్చును ఓ మీడియా సంస్థ వెల్లడించింది. ఢిల్లీ ప్రజలు కోవిడ్‌తో పోరాడుతున్నప్పుడు.. వారు 'శీష్ మహల్' నిర్మాణంపై దృష్టి పెట్టారు. వారు ఢిల్లీ ప్రజల గురించి పట్టించుకోవడం లేదు" అని మోడీ అన్నారు. నీటి కొరత, వరదలు, కాలుష్యంతో ఢిల్లీలోని ప్రతి సీజన్‌ను ఆప్(దా) (విపత్తు) అత్యవసర పరిస్థితిగా మార్చింది. ఢిల్లీ అభివృద్ధిపై కేజ్రీవాల్ సర్కారుకు విజన్ లేదని.. అభివృద్ధి పనులన్నీ కేంద్ర ప్రభుత్వమే చేస్తుందన్నారు. ఢిల్లీలోని ప్రతి మూలకు మెట్రో చేరుకునేలా బీజేపీ చేసిందన్నారు. నమో రైలు సర్వీస్, హైవేలు, ఫ్లై ఓవర్లు, అన్నీ కేంద్ర ప్రభుత్వమే నిర్మిస్తుందన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదలకు ఇళ్లు నిర్మించుకునేందుకు నిధులు కేటాయిస్తుందన్నారు.
నమో భారత్ కారిడార్
అంతకుముందు, ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) ఢిల్లీ-ఘజియాబాద్-మీరఠ్ నమో భారత్ (Namo Bharat) కారిడార్ ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌లోని సాహిబాబాద్, ఢిల్లీలోని న్యూ అశోక్ నగర్ మధ్య నమో భారత్ ఆర్‌ఆర్‌టీఎస్(RRTS) కారిడార్‌లో 13 కిలోమీటర్ల అదనపు సెక్షన్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన విద్యార్థులతో కలిసి సాహిబాబాద్ నుంచి న్యూ అశోక్ నగర్ వరకు ప్రయాణించారు. ఈమార్గంలో కొత్తగా ప్రారంభించిన రైలు 13 కిలోమీటర్ల విభాగంలో 6కిలోమీటర్ల మేర అండర్ గ్రౌండ్ లో నడవనున్నట్లు అధికారులు వెల్లడించారు. నమో భారత్ రైళ్లు అండర్ గ్రౌండ్ లో నడపడం ఇదే తొలిసారని తెలిపారు.