Srinivas Goud : పాలిటెక్నిక్ విద్యార్థినులను కలిసిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

by M.Rajitha |
Srinivas Goud : పాలిటెక్నిక్ విద్యార్థినులను కలిసిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
X

దిశ, వెబ్ డెస్క్ : మహబూబ్ నగర్ పాలిటెక్నిక్ కాలేజీ(Polytechnic College)లో విద్యార్థినుల వాష్ రూంలో సీక్రెట్ కెమెరాలు పెట్టిన ఘటన కలకలం రేపింది. శనివారం విద్యార్థినులు కాలేజీలో పెద్ద ఎత్తున ధర్నా చేశారు. నేడు బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud) కాలేజీకి వెళ్ళి విద్యార్థినులతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకున్న చర్యలతో ఆడపిల్లలను కన్నెత్తి చూడాలన్నా, వేధించాలన్నా భయపడే పరిస్థితి ఉండేదని అన్నారు. రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాడ్డాక మళ్లీ ఆడపిల్లలపై వేధింపులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థినిలకు ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే ఉపాధ్యాయులకు చెప్పాలని, అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఆకతాయిల బెదిరింపులకు బయడవద్దని, ధైర్యంగా వారిని ఎదుర్కోవాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed