రూ.320కే స్వచ్ఛమైన ఆవు నెయ్యి వస్తుందా అని ఆలోచించాలి కదా?: టీటీడీ ఈవో

by Jakkula Mamatha |
రూ.320కే స్వచ్ఛమైన ఆవు నెయ్యి వస్తుందా అని ఆలోచించాలి కదా?: టీటీడీ ఈవో
X

దిశ,వెబ్‌డెస్క్: తిరుమల(Tirumala)లో వ్యవస్థలు దెబ్బతిన్నాయని అపవిత్రమైన కార్యక్రమాలు జరుగుతున్నాయని గతంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) తమ దృష్టికి తీసుకొచ్చారని టీటీడీ ఈవో చెప్పారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో శ్యామలరావు(TTD EO Shyamala Rao) ఇవాళ(సోమవారం) తిరుమలలో జరుగుతున్న పరిణామాలపై మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. తిరుమలలో అపవిత్రమైన కార్యక్రమాలు జరుగుతున్నాయని గతంలో సీఎం చంద్రబాబు తమ దృష్టికి తీసుకొచ్చారని గుర్తుచేశారు. ఈ వ్యవస్థల పై ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారని తెలిపారు. భక్తుల సూచనల మేరకు టీటీడీ(TTD)లో అన్ని వ్యవస్థలను క్రమబద్ధీకరించే దిశగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

ఈ క్రమంలో దళారులపై పోలీసు, విజిలెన్స్‌ విభాగం నుంచి చర్యలు తీసుకున్నామని ఈవో శ్యామలరావు పేర్కొన్నారు. ఆవు నెయ్యి కల్తీ విషయం అందరికీ తెలిసిందే. ఏఆర్‌ డెయిరీని బ్లాక్‌లిస్టులో పెట్టాం. సిట్‌ విచారణలో ఎవరి నుంచి ఎవరికి నెయ్యి సరఫరా అయిందో వివరాలు సేకరిస్తున్నారని తెలిపారు. రూ.320కే స్వచ్ఛమైన ఆవు నెయ్యి వస్తుందా అని ఆలోచించాలి కదా? అని ఈవో శ్యామలరావు ప్రశ్నించారు. క్వాలిటీ కంట్రోల్‌ వ్యవస్థ పెట్టుకోవాలి కదా? మన వద్ద లేకపోతే ఎక్కడికైనా వెళ్లి నాణ్యత పరీక్షలు చేయించుకోవాలి. గతంలో జరిగిన తప్పు లన్నింటిని ప్రక్షాళన చేశాం. ఇప్పుడు స్వచ్ఛమైన నెయ్యి తో ప్రసాదాలు చేస్తున్నామని.. ప్రస్తుతానికి నందిని నెయ్యి వాడుతున్నట్లు ఈవో శ్యామల రావు వెల్లడించారు.



Next Story

Most Viewed