- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఏపీకి భారీగా ప్రాజెక్టులు: సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రానికి రూ.3 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు వస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(AP CM Chandrababu Naidu) వెల్లడించారు. బ్యాంకర్ల(Bankers)తో సమావేశంలో పాల్గొన్న ఆయన రాష్ట్రానికి అండగా నిలవాలని కోరారు. 2025-26 ఏడాదికి రూ. 6.6 లక్షల కోట్లతో క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరణ చేసినట్లు తెలిపారు. గత సంవత్సరం కంటే 22 శాతం అధికంగా రుణ ప్రణాళిక చేసినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఎంఎస్ఈల(MSEs)కు చేయూతనివ్వాలని బ్యాంకర్లకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
డిమాండ్‌కు తగ్గట్టుగా ఏ రంగం పురోగతి సాధించాలన్నా బ్యాంకుల మద్దతు తప్పనిసరి అని చంద్రబాబు తెలిపారు. వివిధ రంగాల్లో భారీగా ప్రాజెక్టులు వస్తున్నాయని, వాటికి అవసరమైన ఆర్ధిక మద్దతు ఇవ్వాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇంటికో ఎంట్రప్రెన్యూర్ లక్ష్యంతో ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈలు, అలాగే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లు ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. 2029 కల్లా పేదరికం నిర్మూలించేలా జీరోపావర్టీ-పీ4 అమలు చేసి అసమానతలు తొలిగించేలా కృషి చేస్తున్నామని తెలిపారు. సంపద సృష్టికి, మౌలిక సదుపాయాల కల్పనకు పీపీపీ విధానాన్ని రాష్ట్రంలో విస్తృతంగా అమలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.