ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేశారు: కేటీఆర్

by Mahesh |
ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేశారు: కేటీఆర్
X

దిశ, వెబ్ డెస్క్: భారత రాజ్యాంగ రూపకర్త, భారతరత్న డా. బీఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను తెలంగాణ భవన్ (Telangana Bhavan)లో ఏర్పాటు చేశారు. ఈ జయంతి ఉత్సవాలకు హాజరైన కేటీఆర్ (KTR) అంబేద్కర్‌కు నివాళులు అర్పించిన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొంతమంది అంబేద్కర్ ఓ వర్గానికి చెందిన నాయకుడిగా ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అలాగే స్వాతంత్ర్యం అనంతరం రాజ్యాంగాన్ని రూపొందించిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. ఒక రాష్ట్రంలో ఒక భాష ఉండాలనే మంచి ఆలోచన చేశారని, పరిపాలన సౌలభ్యం కోసం ఆయన ముందు చూపుతో అనేక నిర్ణయాలు తీసుకున్నారని, ఆయన నిర్ణయాల వల్లే దేశం పటిష్టంగా మారిందని కొనియాడారు. అంబేద్కర్ రాజ్యాంగ స్పూర్తితో.. మాజీ సీఎం కేసీఆర్ ముందుకు వెళ్లారని.. ఇందులో భాగంగానే దళిత బందును తీసుకొచ్చారని అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా.. కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అన్నారు.

ఎన్నికల సమయంలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ (SC ST Declaration) పేరుతో ప్రజలను మోసం చేశారని గుర్తు చేశారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా తాను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నానని, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ఎప్పుడు చేస్తారని అన్నారు. అలాగే కాంట్రాక్టుల్లో రిజర్వేషన్లను ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని, రాష్ట్రంలో రేవంత్ చెప్పే మాటలను ప్రజలు నమ్మె పరిస్థితి లేదని అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని నాయకుడిని పదవి నుంచి తొలగించాలనే రూల్ అంబేద్కర్ రాయలేదని.. ఆయనకు అప్పట్లో ఇలాంటి వాళ్ల గురించి తెలియలేదని అన్నారు. చివరగా.. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి మారిపోయిందని, ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు జరిగే..బీఆర్ఎస్ పార్టీ తుఫాన్ వేగంతో అధికారంలోకి వస్తుందని అన్నారు. అలాగే సుప్రీంకోర్టు గవర్నర్ పై ఇచ్చిన తీర్పును.. అసెంబ్లీ స్పీకర్‌లపై కూడా ఇవ్వాలని, పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడం లేదని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు.



Next Story

Most Viewed