- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
కొడంగల్ నియోజకవర్గం రూపురేఖలు మారుతాయి

దిశ, కోస్గి : కొడంగల్ నియోజకవర్గం దేశంలోనే అభివృద్ధిలో నంబర్ వన్ స్థానాన్ని సంపాదించుకోవడం ఖాయమని కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఎనుముల తిరుపతి రెడ్డి అన్నారు. సోమవారం నియోజకవర్గంలో కోస్గి మద్దూర్ మండలాలతో పాటు తుంకిమెట్ల నుంచి నారాయణపేట వెళ్లే రహదారుల నిర్మాణం, విస్తరణల పనుల కోసం మొత్తం రూ, 127 కోట్ల 54 లక్షల నిధుల పనులకు భూమి పూజలు చేశారు. అనంతరం ఆయన కోస్గి పట్టణంలోని బి. సి కాలనీ నుండి ముక్తి పహాడ్ గ్రామానికి ఏర్పాటు చేయనున్న రహదారి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గ ప్రజలు 36 వేలకు పైగా మెజార్టీతో గెలిపించి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారని, అందుకు కృతజ్ఞతగా అహర్నిశలు నియోజకవర్గం కోసం సీఎం రేవంత్ రెడ్డి ఆలోచిస్తూ, కని విని ఎరుగని విధంగా అభివృద్ధి చేయాలనీ పరితపిస్తున్నాడని తెలిపారు.
పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరు నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు.. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ ప్రజల జీవన స్థితిగతులను మార్చేందుకు కంకణం కట్టుకొని ముందుకు సాగుతున్నామన్నారు. వెనుకబడిన ఈ కొడంగల్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే ఒక ఎమ్మెల్యేగా, మంత్రి పదవితో చేయలేమని అందుకే ముఖ్యమంత్రి పదవి తో అభివృద్ధి చేయడం సాధ్యం అన్నారు. ఆ దిశగా ప్రణాళికలను రూపొందించి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలకు శ్రీకారం చుడుతున్నామన్నారు. సీఎం తన పదవి కాలంలో ప్రతి ఒక్కరు అబ్బురపడేలా ప్రతి గ్రామం ప్రతి పల్లె ఆవాస ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందుతాయన్నారు.
పనుల వివరాలను తెలియ జేస్తూ, ఇమ్దాపూర్, కొత్తపల్లి, చంద్రవంచ వరకు రోడ్ విస్తరణ కోసం రూ. 1316.25 లక్షలు,చంద్రవంచ నుంచి ముస్రిఫా గ్రామం వరకు ముంగిమల్ల గ్రామం గుండా రోడ్ నిర్మాణం కోసం రూ. 455.00 లక్షలు, పొతిరెడ్డిపల్లి నుంచి పంధిరి హన్మండ్లు వరకు తోగాపూర్ గ్రామం గుండా రోడ్ నిర్మాణం కోసం, రూ. 780.00 లక్షలు,కోస్గి, గుండమల్, నర్సంపల్లి, సరంగారావు పల్లి, ముదిరెడ్డిపల్లి గుండా రోడ్ విస్తరణకు - రూ. 3037.50 లక్షలు, కోస్గి నుండి ముక్తిపాడ వరకు రోడ్ రోడ్ నిర్మాణం కు రూ. 390.00 లక్షలు, కోస్గి నుంచి మద్దూర్ వరకు పల్లెర్ల, లక్కైపల్లి, నందిపహాడ్, మిర్జాపూర్, బీజ్జారం, చెన్నారం గుండా రోడ్ విస్తరణకు - రూ.6204.00 లక్షలు,తుంకిమెట్ల నుండి నారాయణపేట రోడ్ (ఆర్ అండ్ బి) వరకు నిడివి పెంచి 2 లేన్లతో కూడిన పేవ్డ్ షోల్డర్‌తో కూడిన రోడ్ అభివృద్ధి చేస్తామని, కోస్గి నుండి తోగాపూర్ వరకు రోడ్ నిర్మాణానికి - రూ. 572.00 లక్షలు, ఇలా మొత్తం రూ, 127 కోట్ల 54 లక్షల నిధులతో 5 నెలల్లో ఈ పనులు ఈ రోజు నుంచి ప్రారంభిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ వార్ల విజయకుమార్, కాడ చైర్మన్ వెంకటరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రఘువర్ధనరెడ్డి, కాంగ్రెస్ మున్సిపల్ అధ్యక్షులు బెజ్జురాములు, సహకార సంఘము ఛైర్మెన్ తుమ్ భీం రెడ్డి, మున్సిపల్ కమిషనర్ నాగరాజ్, కౌన్సిలర్స్ తుడుం శ్రీను, మాస్టర్ శ్రీను, ఇద్రిష్, మండల నాయకులు మేకల రాజేష్, అన్న కిష్టప్ప, నాగులపల్లి నరేందర్ రెడ్డి, విక్రమ్ రెడ్డి సలీం తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.