Congress: పహల్గాం ఉగ్రదాడిపై కాంగ్రెస్ నేతలకు అధిష్టానం కీలక ఆదేశాలు

by Ramesh N |
Congress: పహల్గాం ఉగ్రదాడిపై కాంగ్రెస్ నేతలకు అధిష్టానం కీలక ఆదేశాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: జమ్మూ కాశ్మీర్‌లోని (Pahalgam terror attack) పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్ (Congress High command) అధిష్టానం కీలక ఆదేశాలు జారీ చేసింది. పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా పార్టీ లైన్ దాటి ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని సోమవారం కాంగ్రెస్ నేతలకు అధిష్ఠానం ఆదేశాలిచ్చినట్లు తెలిసింది. అయితే ఉగ్రదాడిపై కొంత మంది కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి, దీంతో కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. పహల్గాం అంశంపై భవిష్యత్తులో జరిగే ఏదైనా సమాచార మార్పిడి కాంగ్రెస్ ప్రకటించిన వైఖరికి కట్టుబడి ఉండాలని పార్టీ నాయకత్వం స్పష్టం చేసినట్లు తెలిసింది.

ఉగ్రదాడిపై పలువురు కాంగ్రెస్ నాయకులు అడ్డదిడ్డంగా మాట్లాడటం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge), అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) దృష్టికి వచ్చినట్లు పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పాకిస్తాన్‌తో యుద్ధం అవసరం లేదని, బదులుగా భద్రతా వ్యవస్థను బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే.


Next Story

Most Viewed