- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Akira Nandan: అకీరా నందన్ సినీ ఎంట్రీ.. రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) మాజీ భార్య రేణు దేశాయ్(Renu Desai) గురించి పరిచయం అక్కర్లేదు. హీరోయిన్‌గా పలు సినిమాల్లో నటించిన ఆమె గత కొద్ది రోజున నుంచి ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. చివరగా 2023లో రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’(Tiger Nageswara Rao) మూవీలో కనిపించింది. ఇక అప్పటి నుంచి తన ఇద్దరు పిల్లలు ఆద్య, అకీరాలను చూసుకుంటుంది. అలాగే సోషల్ మీడియా(Social Media)లోనూ యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులు పెడుతోంది. కుటంబంతో కలిసి ఇటీవల రేణు దేశాయ్ ఆధ్యాత్మిక యాత్రలో బిజీగా ఉంది.
ఇదిలా ఉంటే.. తాజాగా, విజయవాడలో ఓ ఈవెంట్‌లో పాల్గొన్న రేణు దేశాయ్, అకీరా(Akira Nandan) సినీ ఎంట్రీపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘ఈ సమయం కోసం నేను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఒక తల్లిగా మీ అందరికంటే ఎక్కువగా నాకే ఆసక్తి ఉంటుంది. అతను ఎప్పుడు ఓకే అంటే అప్పుడే. అకీరా నందన్ ఇష్టంతోనే సినిమాల్లోకి రావాలి కానీ నేను బలవంతం చేయను. అంత వరకు అందరూ వెయిట్ చేయండి’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రేణు దేశాయ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న పవన్ అభిమానులు నిరాశ చెందుతున్నారు.