Sanjay Raut:మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ పై శివసేన యూబీటీ ఎంపీ సంజయ్ రౌత్ ప్రశంసలు

by Shamantha N |   ( Updated:2025-01-03 10:17:50.0  )
Sanjay Raut:మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ పై శివసేన యూబీటీ ఎంపీ సంజయ్ రౌత్ ప్రశంసలు
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్(Devendra Fadnavis) పై శివసేన(యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్(Sanjay Raut) ప్రశంసలు కురిపించారు. నక్సల్స్ ప్రభావిత గడ్చిరోలి(Gadchiroli) కోసం ఆయన చేసిన కార్యక్రమాలు అభినందించాలని అన్నారు. చీలిపోయిన పవార్లు మళ్లీ కలిసిపోతారని వార్తలువస్తుండగా.. ఈ పరిణామం జరగడం గమనార్హం. కాగా.. సంజయ్ రౌత్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఫడ్నవీస్ పై ప్రశంసలు కురిపించడం హాట్ టాపిక్ గా మారింది. “గతంలో ఫడ్నవీస్‌తో కలిసి పనిచేశాం. నక్సల్స్ ప్రభావిత గడ్చిరోలి కోసం ఆయన చేసిన కార్యక్రమాలను అభినందించాల్సిందే. ప్రభుత్వం మంచి పని చేసింది. దాన్ని మేం ప్రశంసిస్తాం. నక్సలైట్లు లొంగిపోయి రాజ్యాంగ మార్గాన్ని ఎంచుకుంటే, మేం దాన్ని స్వాగతిస్తున్నాం “ అని ఫడ్నవీస్ చెప్పుకొచ్చారు. గడ్చిరోలి "మహారాష్ట్ర ఉక్కు నగరం"గా మారుతుందని, ఈ ప్రాంతానికి మరిన్ని పరిశ్రమలు వస్తాయని రౌత్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ ప్రాంతం అంతకు మించిన మేలు ఏమీ లేదని చెప్పుకొచ్చారు.

చీలిపోయిన శివసేన

ముఖ్యమంత్రి పదవిపై వివాదంతో 2019 బీజేపీతో శివసేన సంబంధాలు తెంచుకుంది. ఆ తర్వాత శివసేన రెండుగా చీలిపోయింది. 2022లో ఏకనాథ్ షిండే నేతృత్వంలోని షిండే వర్గం బీజేపీతో చేరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇకపోతే, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ మధ్య సయోధ్య కుదురుతుందని ఊహాగానాలు వచ్చాయి. ఈ టైంలో ఫడ్నవీస్ పై సంజయ్ రౌత్ ప్రశంలతో ముంచెత్తారు.

Advertisement

Next Story

Most Viewed