Bhatti : 20వేల మెగావాట్ల క్లీన్ ఆండ్ గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యం : భట్టి

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2025-01-03 10:30:51.0  )
Bhatti : 20వేల మెగావాట్ల క్లీన్ ఆండ్ గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యం : భట్టి
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో 20వేల మెగావాట్ల క్లీన్ ఆండ్ గ్రీన్ ఎనర్జీ (Clean and Green Energy) ఉత్పత్తి(Produce) లక్ష్యంగా పెట్టుకున్నామని డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) వెల్లడించారు. క్లీన్ ఆండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2024 సదస్సులో ఆయన మాట్లాడారు. ఇంధన పునరుత్పత్తి, క్లీన్ ఆండ్ గ్రీన్ ఎనర్జీ భవిష్యత్తు తరాలకు అవసమరమన్నారు. పర్యావరణ నిపుణులు, సామాజిక వేత్తలు క్లీన్ ఆండ్ గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తున్నారన్నారు. రాష్ట్రానికి 15,623మెగావాట్ల డిమాండ్ నుంచి 2030కల్లా 24,215మెగావాట్ల డిమాండ్ కు చేరుకుంటుందన్నారు. 2035నాటికి 31,890మెగావాట్ల విద్యుత్ అవసరమని లెక్కలు చెబుతున్నాయన్నారు. పెరుగుతున్న డిమాండ్ మేరకు కాలుష్య రహిత 20వేల మెగావాట్ల క్లీన్ ఆండ్ గ్రీన్ ఎనర్జీని తయారు చేసుకోవాలని న్యూ ఎనర్జీ పాలసీతో ముందుకెలుతామన్నారు. ఇందుకోసం ప్రోత్సహాకాలు, మౌలిక సదుపాయల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుందని తెలిపారు.

నిపుణులు, పారిశ్రామిక వేత్తలు, అధికారుల సూచనల మేరకు న్యూ ఎనర్జీ పాలసీ రూపొందిస్తామన్నారు. మహిళా సంఘాలకు పీఎం కుసుమ్ లో భాగంగా 4వేల మెగావాట్లలో 1000మెగావాట్లకు ఎంవోయూ చేశామని, సోలార్ విద్యుత్ ఉత్పత్తి దిశగా కేంద్రం అమలు చేస్తున్న పథకంలో భాగంగా సాగు పంప్ సెట్లు, రూప్ టాప్ సోలార్ పైలట్ ప్లాంట్లను అమలు చేయబోతున్నామన్నారు. భవిష్యత్తులో ఇతర రాష్ట్రాలకు విద్యుత్తు విక్రయించే స్థాయికి చేరుకోవాలన్నదే మా ఆకాంక్ష అన్నారు.

ఫ్యూచర్ సిటీ, ఫార్మా సిటీ, మెట్రో విస్తరణ, త్రిఫుల్ ఆర్, పారిశ్రామిక క్లస్టర్లు వంటి విస్తరణతో విద్యుత్తు వినియోగం పెరుగనుందన్నారు. కొద్ధి రోజుల్లోనే న్యూ ఎనర్జీ పాలసీని తీసుకొస్తామన్నారు. ప్రస్తుతం పాలసీ మేకింగ్ లో చేసిన కసరత్తును ఈ సదస్సులో పెడుతున్నామన్నారు. థర్మల్ పవర్ ఫ్లాంట్ల ఆధునీకరణ చేస్తామన్నారు. విద్యుత్ చార్జీల పెంపు ఈ ఏడాదిలో లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ సెక్టార్ లోనూ క్లీన్ ఆండ్ గ్రీన్ ఎనర్జీ ప్లాంట్లను నెలకొల్పే ఆలోచన ఉందన్నారు. బయట రాష్ట్రాల్లోనూ విద్యుత్ ఉత్పత్తి కార్యక్రమాల్లో భాగస్వామ్యమవుతామన్నారు.

Advertisement

Next Story

Most Viewed