Bandi: కేరళ బస్సు ప్రమాదంపై స్పందించిన కేంద్రమంత్రి.. భక్తులకు సహాయం

by Ramesh Goud |
Bandi: కేరళ బస్సు ప్రమాదంపై స్పందించిన కేంద్రమంత్రి.. భక్తులకు సహాయం
X

దిశ, వెబ్ డెస్క్: కేరళ(Kerala)లో అయ్యప్పస్వాములకు జరిగిన బస్సు ప్రమాదం(BUS Accident)పై కేంద్రహోం శాఖ సహాయమంత్రి బండి సంజయ్(Union Minister Bandi Sanjay) స్పందించారు. కొట్టాయం జిల్లా కలెక్టర్(Kottayam District Collector) తో మాట్లాడి ప్రమాదంలో గాయపడిన అయ్యప్ప స్వాములకు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించేలా ఏర్పాట్లు చేశారు. అనంతరం వారికి శబరిమల దర్శనం చేయించి, భక్తులు తిరుగు ప్రయాణం అయ్యేందుకు సహాయపడ్డారు. అంతేగాక ప్రమాదంలో మృతి చెందిన బస్సు డ్రైవర్ మృతదేహానికి పోస్టు మార్టం పూర్తి చేసి వెంటనే హైదరాబాద్(Hyderabad) తరలించేలా ఏర్పాట్లు చేశారు. దీనిపై బస్సు ప్రమాదంలో గాయపడ్డ భక్తులు స్పందిస్తూ.. వీడియో విడుదల చేశారు. తమకు సహాయం చేసిన కేంద్రమంత్రి బండి సంజయ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా హైదరాబాద్ ఉప్పర్ గూడకు చెందిన అయ్యప్ప స్వాముల బస్సు శబరిమల దర్శనానికి వెళుతూ కొట్టాయం ఘాట్ వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. ఇందులో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా.. బస్సులో ఉన్న 30 మందికి పైగా భక్తులకు గాయాలు అయ్యాయి.

Advertisement

Next Story

Most Viewed