Formula E-Race Case: కేటీఆర్‌ రోజుకో మాట మాట్లాడుతున్నారని షబ్బీర్‌ అలీ ఫైర్

by Gantepaka Srikanth |
Formula E-Race Case: కేటీఆర్‌ రోజుకో మాట మాట్లాడుతున్నారని షబ్బీర్‌ అలీ ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఫార్ములా ఈరేస్ కేసు(Formula E-Race Case)పై కాంగ్రెస్(Congress) సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ(Shabbir Ali) కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్‌(KTR) రోజుకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. అరవింద్‌కి డబ్బులు బదిలీ చేయమని తానే చెప్పానన్నారు. కోర్టులో మాత్రం.. తనకేం సంబంధం లేదని చెప్తున్నారని మండిపడ్డారు. అదే కేటీఆర్‌ నీతి అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నోటీసులు ఇస్తేనే కేటీఆర్‌ లొల్లి చేస్తున్నాడు.. గతంలో జన్వాడ ఫాంహౌస్‌ ఎపిసోడ్‌లో కూడా ఇలానే చేశారని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. బీఆర్‌ఎస్‌ పనికట్టుకుని బురద జల్లే పనిలో పడ్డారని ఆరోపించారు.

తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీకి కొంత సమయం ఇచ్చే వాళ్ళమని, కానీ కేటీఆర్.. హరీష్‌లు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ కనిపించడం లేదు.. ప్రతిపక్ష నాయకుడు ఎవరు అనేది తెలియడం లేదని ఎద్దేవా చేశారు. గత పదేళ్ల లో మీరేం చేశారో గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు. ఇదిలా ఉండగా.. ఫార్ములా ఈ రేస్ కేసులో హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్‌ రెడ్డి(BLN Reddy) గురువారం (జనవరి 02న) ఈడీ విచారణకు గైర్హాజరయ్యారు. కాస్త గడువు కావాలని ఈడీకి విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed