Blood circulation: శరీరంలో రక్తప్రసరణ సాఫీగా జరగడం లేదని సూచించే లక్షణాలు..?

by Anjali |
Blood circulation: శరీరంలో రక్తప్రసరణ సాఫీగా జరగడం లేదని సూచించే లక్షణాలు..?
X

దిశ, వెబ్‌డెస్క్: మనిషికి ఆరోగ్యకరమైన రక్త ప్రసరణ వ్యవస్థ(circulatory system)ను కలిగి ఉండటం ఆరోగ్యానికి ఎంతో అవసరం. రక్త ప్రసరణ వ్యవస్థ గుండె, రక్త నాళాలతో రూపొందించబడి ఉంటుంది. ఇది మీ బాడీలోని అన్ని అవయవాలు, కణజాలాలకు ఆక్సిజన్(Oxygen), ఇతర పోషకాలను రవాణా చేయడానికి పనిచేస్తుంది. కార్బన్ డయాక్సైడ్(Carbon dioxide), వ్యర్థ పదార్థములను తొలగించడంలో మేలు చేస్తుంది. బ్లడ్ ద్వారానే మన బాడీలోని అన్ని పార్ట్స్‌కు ఆక్సిజన్, పోషకాలు అందుతాయి. అలాంటిది శరీరంలో బ్లడ్ సర్కులేషన్ సాఫీగా జరగకపోతే అనే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కాగా లక్షణాల్ని ముందే గుర్తించి.. వైద్యుడ్ని సంప్రదించాలంటున్నారు నిపుణులు. మీ ఏఏ లక్షణాలో కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..

బాడీలో బ్లడ్ సర్కులేషన్ సాఫీగా జరగకపోతే శరీరంలోని వివిద భాగాలకు తగినన్నీ పోషకాలు, ఆక్సిజన్ అందదు. అంతేకాకుండా అవయవాలు సరిగ్గా పనిచేయవు. చేతులు, కాళ్లు చల్లగా అనిపిస్తుంది. అలాగే వాపు సమస్య(swelling) తలెత్తుతుంది. పాదాలు వాపు రావడం, చీలమండలు, చేతుల్లో ఈ సమస్య రావచ్చు. వీటితో పాటు తిమ్మిర్లు(Cramps), గాయమైతే నెమ్మదిగా నయమవ్వడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. స్కిన్ కలర్(Skin color) కూడా మారిపోతుంది. స్కిన్ పసుపు లేదా ఎరుపు రంగులోకి మారిపోతుంది.అంతేకాకుండా హెయిర్ ఫాల్(Hair fall) కు కూడా దారితీస్తుంది.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed