Relationships : సంబంధాలు.. బలమైన అనుబంధాలు!!

by Javid Pasha |
Relationships : సంబంధాలు.. బలమైన అనుబంధాలు!!
X

దిశ, ఫీచర్స్ : ప్రేమ, స్నేహం, భావోద్వేగం, అనుబంధం, ఆప్యాయత.. ఇలాంటి మానవ సంబంధాల ప్రస్తావన ఇప్పుడేదో కొత్తగా వచ్చిపడింది కాదు, చరిత్ర పుటల్లోనూ, కావ్యాల్లోనూ, కథల్లోనూ, కల్పిత గాధల్లోనూ లిఖించి బడిన ప్రేమపాఠాలు, స్నేహ బంధాలు చాలానే ఉన్నాయి. లైలా మజ్ను, దేవదాసు పార్వతి, కులీ కుతుబ్ షా భాగ్యమతి, షాజహాన్ ముంతాజ్ బేగం.. వంటి అమర ప్రేమికులు, శ్రీకృష్ణుడు కుచేలుడి వంటి స్నేహితుల గురించి వింటుంటే.. మనుషుల మధ్య అనుబంధాలు ఎంతలా పెనవేసుకుంటాయో మనకు తెలిసొస్తుంది అంటున్నారు నిపుణులు. అలాంటి స్ఫూర్తి ఆధునిక సమాజంలోనూ అవసరమని చెబుతున్నారు. ముఖ్యంగా రిలేషన్‌షిప్స్‌ ఎన్నిరకాలు, అవి‌ సాఫీగా సాగేందుకు దోహద పడే అంశాలేవో ఇప్పుడు చూద్దాం.

లవ్ రిలేషన్‌షిప్స్

భార్యా భర్తలు లేదా భాగస్వాముల మధ్య చిన్న చిన్న తగాదాలు సహజమే. అయితే ఇవి ఎక్కువై.. అర్థం చేసుకోవడం తక్కువైతే ఆ బంధం విచ్ఛిన్నం అవుతుంది. కాబట్టి ఇద్దరి మధ్య బంధం బలపడాలంటే ఇరువైపులా ప్రేమ, ఆప్యాయత ఉండాలంటున్నారు నిపుణులు. దీంతోపాటు పరస్పర నమ్మకం, గౌరవం, నైతిక విలువలకు కట్టుబడి ఉండటం, కమ్యూనికేషన్ లోపాలు లేకుండా చూసుకోవడం వంటివి కూడా ప్రేమ సంబంధాల్లో (love relationships) కీ రోల్ పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ఫ్యామిలీ రిలేషన్స్

కుటుంబ సంబంధాల(Family relationships)లను మరింత బలోపేతం చేయడంలో భావోద్వేగ మద్దతు, అభిమానం, ఆప్యాయత వంటివి ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఫ్యామిలీ మెంబర్స్‌తో, ముఖ్యంగా తల్లిదండ్రులు, తోబుట్టువులు, సహోదరులు, పిల్లలతో ఉన్న సంబంధాలు ప్రేమ, భావోద్వేగాలతో ముడిపడి ఉంటాయి. ఒడిదుడుకులు, సమస్యలు వచ్చినా ఫ్యామిలీ రిలేషన్స్‌లో అర్థం చేసుకోవడం, సర్దుకుపోవడం అనేది అనుబంధాలను బలోపేతం చేస్తుంది.

ఫ్రెండ్లీ రిలేషన్స్

ఫ్రెండ్లీ రిలేషన్స్ (friendly relations).. నమ్మకం, విధేయత, ఒకేరకమైన ఇంట్రస్ట్, ఎమోషనల్ సపోర్ట్ వంటి అంశాలపై ఆధారపడి ఉంటాయి. చిన్న వయస్సులో ఏర్పడిన స్నేహాలు, అలాగే చదువుతున్నప్పుడు, ఉద్యోగాలు చేస్తున్నప్పుడు ఏర్పడే స్నేహాలు, బయట పరిచయస్తులు.. ఇలా ఫ్రెండ్లీ రిలేషన్స్ చాలానే ఉంటాయి. అయితే కొన్ని మాత్రం కలకాలం గుర్తుండిపోతాయి. ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఆయా పరిస్థితుల్లో సపోర్టుగా నిలవడం, ఓపెన్ కమ్యూనికేషన్ వంటివి ఇందుకు దోహదం చేస్తాయని, వ్యక్తుల మధ్య సంబంధాలను బలోపేతం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ప్రొఫెషనల్ రిలేషన్స్

వర్క్ ప్లేస్‌లో ముఖ్యంగా ఒకే తరహా ఉద్యోగాలు చేసేవారిలో ఏర్పడే స్నేహ పూర్వకమైన సంబంధాలనే ప్రొఫెషనల్ రిలేషన్స్ లేదా వృత్తి పరమైన (mentorship) సంబంధాలు అంటారు. ఇక్కడ ఒకరికొకరు మార్గదర్శకంగా ఉండటం, పరస్పర గౌరవం, ఎదుగుదలకు సహకరించుకోవడం, మర్యాద పూర్వకంగా నడుచుకోవడం, ఇబ్బంది కరపరిస్థితుల్లో మద్దతుగా నిలవడం బంధాలను బలోపేతం చేస్తాయి. వీటితోపాటు ఆయా వ్యక్తుల మధ్య ఒకే తరహా గోల్స్, సామాజిక మద్దతు, కామన్ ఇంట్రస్ట్, సేమ్ ఓపీనియన్స్, పరస్పర సహకారం వంటివి సంబంధాలను బలోపేతం చేస్తాయి.

Advertisement

Next Story

Most Viewed