దేశవ్యాప్తంగా జొమాటో, స్విగ్గీ సర్వీసులు డౌన్!

by Harish |
దేశవ్యాప్తంగా జొమాటో, స్విగ్గీ సర్వీసులు డౌన్!
X

న్యూఢిల్లీ: దేశీయ దిగ్గజ ఫుడ్ డెలివరీ యాప్‌లు సాంకేతిక కారణాల వల్ల బుధవారం దేశవ్యాప్తంగా నిలిచిపోయి. దీంతో చాలా మంది వినియోగదారులు అసౌకర్యానికి గురయ్యారు. దీంతో ఫుడ్ డెలివరీ యాప్‌ల నుంచి ఫుడ్ ఆర్డర్ చేయడం క్లిష్టంగా మారింది. అమెజాన్ వెబ్ సర్వీస్(ఏడబ్ల్యూఎస్) క్రాష్ కావడం కూడా ఒక కారణమని తెలుస్తోంది. యాప్‌లు క్రాష్ అయిన అరగంటకే తిరిగి ఓపెన్ అయినప్పటికీ ఆర్డర్ చేయడం, మెనూలలో ఉన్న లిస్టింగ్‌లను బ్రౌజ్ చేయడం వంటి సమస్యలు అలాగే ఉన్నాయి. ఈ సమస్య దేశవ్యాప్తంగా నెలకొనడంతో వినియోగదారులు యాప్‌లు పనిచేయడంలేదని, ఆర్డర్ ఇవ్వడానికి కుదరడం లేదని ఫిర్యాదులు చేశారు. దీనిపై స్పందించిన జొమాటో కేర్ అంతరాయానికి సంబంధించి సమస్యను గుర్తించామని, కస్టమర్లకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నట్టు వివరణ ఇచ్చింది.

అలాగే, ట్విట్టర్ ద్వారా తాత్కాలికంగా సమస్య ఏర్పడిందని, దీనిపై కంపెనీ బృందం పనిచేస్తోందని, వీలైనంత త్వరగా పరిష్కారం చూపనున్నట్టు తెలిపింది. కాగా, ఇటీవల కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) జొమాటో, స్విగ్గీ కంపెనీలు అందిస్తున్న ధరల విధానం, ఇతర ఆఫర్లపై విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి రెండు నెలల్లోగా నివేదిక సమర్పించాలని డైరెక్టర్ జనరల్‌ను సీసీఐ ఆదేశించింది. ఈ కంపెనీలు ప్రత్యేక కాంట్రాక్టర్లకు ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నాయి.

Advertisement

Next Story

Most Viewed