ధమాకా ఆఫర్.. రూ.18,000 విలువైన టాబ్లెట్‌ కేవలం రూ. 799

by Harish |
ధమాకా ఆఫర్.. రూ.18,000 విలువైన టాబ్లెట్‌ కేవలం రూ. 799
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మార్చి 27న ఎలక్ట్రానిక్స్ సేల్‌ను తెచ్చింది. ఈ సేల్‌లో భాగంగా, కస్టమర్లకు అన్ని రకాల ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ తగ్గింపులను ఇస్తోంది. తక్కువ ధరలో అధునాతన ఎలక్ట్రానిక్ వస్తువులను పొందేందుకు ఇది మంచి అవకాశం. ఈ సేల్‌లో ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ నోకియా తన టాబ్లెట్‌ Nokia Tab T20 WiFiని అతి తక్కువ ధరకు అందిస్తోంది. మార్కెట్‌లో దీని అసలు ధర రూ. 17,999. కానీ ఎలక్ట్రానిక్స్ సేల్‌‌లో భాగంగా 13 శాతం తగ్గింపుతో రూ. 15,499కి అందుబాటులో ఉంది. ఇంకా CITI బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌తో ఈ టాబ్లెట్‌ను కొనుగోలు చేస్తే తక్షణం రూ.1,500 తగ్గింపు లభిస్తుంది. దీని ద్వారా టాబ్లెట్‌ను రూ. 13,999కి పొందవచ్చు. అదనంగా ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ కూడా ఉంది. పాత స్మార్ట్‌ఫోన్‌‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా రూ. 799 కి వస్తుంది. Nokia Tab T20 WiFi 10.36-అంగుళాల 2K డిస్‌ప్లే, 8,200mAh బ్యాటరీతో అందుబాటులో ఉంది. ఇది 3GB RAM 32GB మెమరీని కలిగి ఉంది. టాబ్లెట్ 8MP ప్రైమరీ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది.

Advertisement

Next Story