బిగ్ బ్రేకింగ్: టీబీజీకేఎస్ కేంద్ర కార్యాలయంలో అగ్నిప్రమాదం

by S Gopi |   ( Updated:2022-03-05 17:08:19.0  )
బిగ్ బ్రేకింగ్: టీబీజీకేఎస్ కేంద్ర కార్యాలయంలో అగ్నిప్రమాదం
X

దిశ, గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రధాన చౌరస్తాలోని టీబీజీకేఎస్ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కేంద్ర కార్యాలయంలో అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. వివరాల్లోకి వెళ్తే... టీబీజీకేఎస్ నాయకులు కేంద్ర కార్యాలయంలో రామగుండం ఎమ్మెల్యేను సన్మానించే కార్యక్రమంలో భాగంగా ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహిస్తున్న గ్రామంలో ఒక్కసారిగా కేంద్ర కార్యాలయంపై మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన నాయకులు సకాలంలో మంటలను ఆర్పారు. షార్ట్ సర్క్యూట్ తోనే మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story