- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎల్లో ఎల్లో హ్యాపీ ఫెలో అంటూ పవన్ కళ్యాణ్‌తో ఉన్న మెమోరీస్ గుర్తు చేసుకున్న మాజీ భార్య(పోస్ట్)
దిశ, వెబ్‌డెస్క్: పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పవన్‌తో విడాకుల తర్వాత మరో పెళ్లి చేసుకోకుండా తమ పిల్లల (ఆద్య, అకిరా నందన్) బాధ్యతలను చూసుకుంటుంది. అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ.. పేద పిల్లలకు, జంతువులకు సహాయం చేస్తుంది. తనకు తోచినంత సహాయం చేయడంతో పాటుగా.. తన ఫ్యాన్స్‌ను కూడా విరాళాలు అడుగుతూ ఉంటుంది. అలాగే సోషల్ మీడియాలో పలు పోస్టులు పెడుతూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అయితే గత కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈమె ‘టైగర్ నాగేశ్వరావు’ మూవీతో సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. మధ్యలో మళ్లీ సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. అయితే తాజాగా ఏడాది తర్వాత షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు తెలియజేసింది. అప్పటి నుంచి దానికి సంబంధించిన ప్రతి అప్డేట్ ఇస్తూ పలు పోస్టులు పెడుతుంది ఈ భామ. ఈ క్రమంలో ఈ బ్యూటీ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.
తాజాగా రేణు దేశాయ్ ఇన్‌స్టా వేదికగా బద్రి సినిమాలోని ఓ మిస్సమ్మ మిస్సమ్మ యమ్మ.. నా మీనస్సే నువ్వే నమ్మా అనే సాంగ్‌ను యాడ్ చేసి ఓ వీడియో షేర్ చేసింది. అందులో ఎల్లో కలర్ శారీ కట్టుకొని.. ‘ఎల్లో ఎల్లో హ్యాపీ ఫెలో.. చాలా కాలం తర్వాత ఏదో సూపర్ ఫన్ కోసం తీశాను’ అనే క్యాప్షన్‌ను జోడించింది. అలాగే షూటింగ్‌కు సంబంధించిన కొన్ని పిక్స్‌ను యాడ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇక దీనిని చూసిన నెటిజన్లు పవన్ అన్నతో ఉన్న మెమోరీస్ గుర్తుకొస్తున్నాయా వదిన అని మీరిద్దరూ కలిసి ఉంటే బాగుండేది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
(video link credits to renudesai instagram id)