మనల్ని ఇబ్బంది పెడుతున్నారని తొందరపడొద్దు.. తుమ్మల సంచలన వ్యాఖ్యలు

by GSrikanth |
మనల్ని ఇబ్బంది పెడుతున్నారని తొందరపడొద్దు.. తుమ్మల సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఖమ్మం జిల్లాకు చెందిన టీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఖమ్మంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఆయన, అక్కడ కార్యకర్తలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయాల్లో ఓపిక చాలా కీలకమని, ఓపిక పడితే కార్యకర్తలే రాజులవుతారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మనలను ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. అయినా సరే, మనం పార్టీలో ఉన్నందున తొందరపడొద్దని సూచించారు. అంతేగాకుండా.. కార్యకర్తలు కూడా ఎవరినీ ఇబ్బంది పెట్టవద్దని తెలిపారు. చిల్లర వ్యక్తుల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. మన ప్రజల కోసం, మన పార్టీ కోసం పనిచేద్దామని పిలుపునిచ్చారు. నేను పదవిలో ఉన్నప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వారిపై ఎటువంటి వివక్షత చూపించలేదని, వేధింపులకు పాల్పడలేదని అన్నారు. అధికారం చూసుకొని వేధింపులకు పాల్పడుతున్న వారి విజ్ఞతకే వదిలేద్దామని తెలిపారు.

Advertisement

Next Story