- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ పంచాయతీల్లో.. ఉప ఎన్నికల పోరుకు రంగం సిద్ధం
దిశ, కాటారం : రాష్ట్రంలో వివిధ కారణాలతో ఖాళీ అయిన స్థానిక సంస్థల పదవులకు ఎన్నికల నిర్వహణ కోసం ఉప పోరుకు రంగం సిద్ధమవుతోంది. గ్రామాల్లో మరో ఎన్నికల నగారా మోగనుండటంతో క్షేత్రస్థాయిలో పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గతంలో ఎన్నికలు నిర్వహించని వివిధ కారణాలతో ఖాళీ అయిన సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. గత శాసనసభ ఎన్నికలకు వినియోగించిన ఓటరు జాబితాలను పంచాయతీలు, వార్డుల ఆధారంగా సిద్ధం చేయాలని షెడ్యూలు ప్రకటించడంతో అధికారులు ముమ్మర కసరత్తు చేస్తున్నారు.
ఎన్నికలకోసం గతంలోనే జాబితాలను తయారు చేసినప్పటికీ కరోనా కారణంగా ఎన్నికల నిర్వహణ చేపట్టలేదు. 2019 జనవరిలో పంచాయతీ అదే ఏడాది మేలో మండల జిల్లా ప్రాదేశిక స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఆ తర్వాత వివిధ కారణాలతో పలు స్థానాలు ఖాళీ అయ్యాయి. వార్డులు, సర్పంచ్ స్థానాల్లో ఖాళీలు ఏర్పడ్డాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఏడు సర్పంచ్ పదవులకు 30వ వార్డులకు ఉప ఎన్నికలు జరగనున్నాయి.
ఉప ఎన్నికలు నిర్వహించే పంచాయతీలు వార్డు సభ్యుల గ్రామాల్లో ఓటరు జాబితాలు సిద్ధమైన అనంతరం వాటిని పంచాయతీలు మండల కేంద్రాలు డివిజన్ స్థాయిలో ప్రచురించి, అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఇదే క్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశాలు నిర్వహించి అభ్యంతరాల పరిశీలన పూర్తి చేసి తుది జాబితాలను ఆయా ప్రాంతాల్లో ప్రచురించే కార్యాచరణ చేపట్టారు. కాటారం మండలంలోని అత్యధికంగా 4 గ్రామ పంచాయతీలకు, 6 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి.
ఎన్నికలు నిర్వహించే స్థానాలు..
సర్పంచ్ స్థానాలు : 7
కాటారం మండలంలో.. 1)జాదరావుపేట 2)మేడిపల్లి 3)మద్దులపల్లి 4)ధన్వాడ,
చిట్యాల మండలంలో.. 1)బావూసింగుపల్లి, 2)చిట్యాల
వార్డు స్థానాలు : జిల్లాలో 30 వార్డులు
డ్రాప్టు ఓటరు జాబితాల ప్రచురణ : ఏప్రిల్ 8
రాజకీయ పార్టీలతో సమావేశాలు : 12
అభ్యంతరాల స్వీకరణ : 16
తుది ఓటరు జాబితా ప్రచురణ : 21