- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మార్స్‌లో ఉన్న అద్బుతమైన ఆ లోయ కింద భూమి దిగదుడుపే! (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్ః భూమిపై నివశించే మనకు భూమి-కేంద్రకంగానే ఆలోచనలు కూడా ఉంటాయి. అందుకే, విశ్వంలో కూడా భూ వాతావరణంతో కూడిన మరో గ్రహం ఉందేమోననే వెతుకలాట కొనసాగుతోంది. మనిషికున్న జ్ఞానానికి అది బహుశా మంచిదే కావచ్చు. ఈ క్రమంలోనే మనిషికి సానుకూలమైన వాతావరణం చంద్రుడు, అంగారక గ్రహంలో మనకి కనిపించాయి. అయితే, ఆ గ్రహాల పైన మానవుడు నివాసం ఉండటం అనేది ఇప్పటికీ ఊహ దశలోనే ఉన్నాయి. అప్పటి వరకు, మనకున్న ఒకే గ్రహం భూమి మాత్రమే. ఇందులో ఎన్నో అద్బుతాలు ఉన్నాయి. ఇలాంటి అద్భుతాలు వేరే గ్రహంలో చూడలేదు కనుక మన భూమిపై ఉన్న లోయల వంటివి మరో గ్రహంలో ఉండకపోవచ్చని అనుకోలేము. ఎందుకంటే, ఈ సౌర వ్యవస్థలో అతిపెద్ద లోయగా ఇప్పటికి గుర్తించింది మార్స్ గ్రహంలో కనిపించింది. భూమిపైన 'గ్రాండ్ కాన్యన్' కంటే, మార్స్‌లో కనిపించిన కాన్యన్ సిస్టమ్ చాలా పెద్దదని ఇటీవల యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) తీసిన చిత్రాలు రుజువు చేస్తున్నాయి.
మన గ్రాండ్ కాన్యన్ కంటే అంగారక గ్రహంపై ఉన్న కాన్యన్ వ్యవస్థ వాలెస్ మారినెరిస్ (Valles Marineris), చాలా పొడవుగా, వెడల్పుగా, అత్యంత లోతుగా ఉంటుందని ESA చిత్రం విశ్లేషణలో అర్థమయ్యింది. గతంలో ఈ లోయలోనే నీటి జాడలు కూడా కనిపించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ లోయ ఏకంగా 4000 కిలోమీటర్ల పొడవు, 200 కిలోమీటర్ల వెడల్పు, 7 కిలోమీటర్ల లోతు వరకు ఉంటుందని అంచనా వేశారు. ఈ కొలతలు గ్రాండ్ కాన్యన్ కంటే చాలా ఎక్కువ. భారతీయ దృక్కోణంలో విషయాలు చెప్పాలంటే, కాశ్మీర్ నుండి కన్యాకుమారి మధ్య దూరం కంటే వల్లేస్ మెరైనెరిస్ పొడవు ఇంకా ఎక్కువగా ఉంటుంది. వాలెస్ మారినెరిస్ చిత్రం ESAకు సంబంధించిన మార్స్ ఎక్స్‌ప్రెస్ నుండి తీసుకున్నది. ఈ చిత్రం రెండు కందకాలను చూపించింది. వాలెస్ మారినెరిస్ పశ్చిమ ప్రాంతాన్ని చస్మా అని పిలుస్తున్నారు. చిత్రం ఎడమ భాగం దక్షిణ దిశగా ఉంది. 840 కిలోమీటర్ల పొడవున్న లస్ చస్మా అక్కడ కనిపిస్తుంది. ఇక, చిత్రం కుడి వైపున 805 కిలోమీటర్ల పొడవున్న టిథోనియం చస్మా కనిపిస్తుంది. ఈ హై రిజల్యూషన్ ఇమేజ్‌లో నమ్మశక్యం కాని ఉపరితల వివరాలు ఉన్నాయి. ఇది 7 కిలోమీటర్ల లోతులో ఉన్న వాలెస్ మారినెరిస్‌ను చూపించింది. టైథోనియం చస్మాలో కనిపించే నల్లబడిన భాగం నల్ల ఇసుక. ఇది థార్సిస్ అగ్నిపర్వత ప్రాంతం నుంచి వచ్చి ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.