- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓటర్ ఐడీ కార్డులో తప్పులు.. సామాన్యులకు తప్పని తిప్పలు
దిశ, లోకేశ్వరం: సిబ్బంది బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం వల్ల కొత్తగా ఓటు నమోదు చేసుకున్న వారికి తిప్పలు తప్పడం లేదు. ఎన్నికల సంఘం జారీ చేస్తున్న ఓటర్ ఐడి రికార్డుల్లో అనేక తప్పులు దొర్లుతున్నాయి. ఇందులో తప్పిదం బూత్ లెవెల్ ఆఫీసర్ల(బిఎల్ఓ) లేక మండల రెవెన్యూ కార్యాలయాల్లో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్‌లదా తెలియడం లేదు. పోస్టు ద్వారా ఓటర్లకు చేరుతున్న ఓటర్ ఐడి కార్డు లో మాత్రం అనేక రకాల తప్పులు నమోదై వస్తున్నాయి. ఇంటి పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, గ్రామం, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇలా అనేక రకాల తప్పులు ముద్రితమైన కార్డులు ఓటర్లకు చేరుతున్నాయి.
సరిదిద్దుకోవాలంటే సామాన్యులకు తప్పని తిప్పలు..
ఓటర్ ఐడి కార్డు లో నమోదైన వివరాలు తప్పుగా ఉంటే వాటిని సరిదిద్దుకోవాలంటే సామాన్యులకు తిప్పలు తప్పడం లేదు. దీంతో సమయంతో పాటు డబ్బులు కూడా వృధా అవుతున్నాయని వారు వాపోతున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు కంప్యూటర్ ఆపరేటర్‌లకు, బిఎల్‌వోలకు సరైన అవగాహన కల్పించి వివరాలు నమోదు చేసే సమయంలో తప్పులు ఉండకుండా జాగ్రత్త పడాలని వారు కోరుతున్నారు.
తప్పు మాది కాదు (సరస్వతి) బిఎల్‌వో అబ్దుల్లాపూర్..
18 ఏళ్లు నిండి అర్హులైన వారు ఓటు నమోదు కోసం వచ్చే వారి ఆధార్ కార్డు తో పాటు అన్ని వివరాలు వ్యక్తిగతంగా తీసుకున్నాము. మళ్లీ ఒకసారి పరిశీలించాక రెవెన్యూ కార్యాలయానికి దరఖాస్తుతోపాటు ఆధార్ కార్డులు జతచేసి పంపించాం.. కానీ కంప్యూటర్ ఆపరేటర్లు వివరాలను నమోదు చేసే సమయంలో అజాగ్రత్తగా వ్యవహరించడం వల్ల ఓటర్ ఐడీ కార్డు లో తప్పులు వస్తున్నాయి ఇందులో నా తప్పేమీ లేదు.
మా తండ్రి పేరు తప్పుగా ముద్రితమైంది.. (నల్ల. సమత) అబ్దుల్లాపూర్
నా పేరు నల్ల సమత, మా తండ్రి పేరు నల్ల లక్ష్మణ్ రెడ్డి ఓటు నమోదు చేసుకునే సమయంలో గత జనవరిలో మా గ్రామంలో బిఎల్‌ఓకు అన్ని వివరాలతో పాటు ఆధార్ కార్డు అందజేశాను. కానీ ఇటీవల ఎన్నికల సంఘం నుండి వచ్చిన ఓటర్ ఐడి కార్డులు మాత్రం మా తండ్రి పేరు నల్ల లక్ష్మణ్ రెడ్డి కి బదులు లక్ష్మణ్ గా నమోదై ఉంది. దీంతో మళ్లీ మీ-సేవ కేంద్రాల చుట్టూ.. తిరగాలి అంటే సమయంతో పాటు డబ్బులు కూడా వృథా కానున్నాయి.
పని ఒత్తిడి వల్ల కంప్యూటర్ ఆపరేటర్లు వేగంగా వివరాలు నమోదు చేయడం వల్ల తప్పులు దొర్లి ఉండవచ్చు.. (లోకేశ్వరం ఎమ్మార్వో)
తగినంతమంది కంప్యూటర్ ఆపరేటర్‌లు లేకపోవడం, వివరాలు నమోదు చేసేందుకు అధికారులు నిర్ణీత గడువు విధించడం వల్ల కంప్యూటర్ ఆపరేటర్ పై పని ఒత్తిడి పెరిగి వేగంగా కంప్యూటర్లలో వివరాలు నమోదు చేయడం వల్ల తప్పులు దొర్లి ఉండవచ్చు. అలాగే టైప్ చేసే సమయంలో ఇంగ్లీష్ వర్షన్ నుండి తెలుగు వర్షన్‌కు కన్వర్ట్ అయ్యే సమయంలో కూడా స్పెల్లింగ్ మిస్టేక్స్ రావచ్చు. ఓటర్ ఐడి కార్డులో వివరాలు తప్పుగా నమోదు ఉంటే మీ సేవ కేంద్రాల్లో సరిచేసుకోవాలి ఇకనుండి అలా జరగకుండా సిబ్బందికి సూచిస్తాం.