- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Pedhapalli: ఏసీబీ చేతిలో లంచావతారుల చిట్టా.. పట్టుబడుతున్న అవినీతి అధికారులు
పెద్దపల్లి జిల్లాపై అవినీతి నిరోధక శాఖ అధికారులు అవినీతి అధికారులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. కొద్దీ రోజులుగా జిల్లాలో వరుసగా అవినీతి అధికారులు పట్టుబడుతున్న తీరే అందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ప్రధానంగా ఏసీబీ అధికారుల వద్ద జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి పాల్పడుతున్న అధికారుల చిట్టా ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. ఏసీబీ అధికారుల సోదాలతో అవినీతి అధికారులు పట్టుబడడంతో అవినీతి అధికారుల వెన్నులో వణుకు పుడుతున్నట్లు జిల్లాలో ప్రచారం జరుగుతోంది. ఆగస్టు 3న కాల్వాశ్రీరాంపూర్ మండలంలో పని చేసిన తహసీల్దార్, ఈ నెల 19న అంతర్గం మండలంలోని పని చేస్తున్న ఇద్దరు ఆర్ఐలను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అయితే పక్కా సమాచారంతో సోమవారం పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. కార్యాలయ ఆవరణలో కాంట్రాక్టర్ నుంచి రూ.20వేలు లంచం తీసుకుంటుండగా ఇరిగేషన్ ఏఈ నర్సింగరావు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారుల వరుస దాడుల జరుగుతున్నా జిల్లాలో మాత్రం ఉన్నతాధికారుల తీరు మారకపోవడంపై హాట్ టాపిక్‌గా మారింది. ఇలాంటి అవినీతి అధికారులపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని జిల్లావాసులు కోరుతున్నారు.
దిశ, పెద్దపల్లి : లంచం... లంచం.. లంచం... బర్త్ సర్టిఫికెట్‌కు లంచం... డెత్ సర్టిఫికెట్‌కు లంచం.. ఇళ్లు కట్టుకోవడానికి లంచం.. కరెంట్ తియ్యడానికి లంచం.. కరెంట్ ఉండడానికి లంచం.. ఇది ఓ సినిమాలోని డైలాగ్ మాత్రమే కాదండోయ్యి. ముఖ్యంగా పెద్దపల్లి జిల్లాలో సినిమా డైలాగ్‌ను తలదన్నే విధంగా ఈ జిల్లాలో అవినీతి ఎరులై పారినట్లు టాక్ వినిపిస్తుంది. ఈ పెద్దపల్లి జిల్లాపై అవినీతి నిరోధక శాఖ అధికారులు అవినీతి అధికారులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. దీని కారణమే కొద్దీ రోజులుగా జిల్లాలో వరుసగా అవినీతి అధికారులు పట్టుబడుతున్న తీరే అందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ప్రధానంగా ఏసీబీ అధికారుల వద్ద జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి పాల్పడుతున్న అధికారుల చిట్టా ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. ఏసీబీ అధికారుల సోదాలతో అవినీతి అధికారులు పట్టుబడడంతో అవినీతికి పాల్పడుతున్న అధికారుల వెన్నులో వణుకు పుడుతున్నట్లు జిల్లాలో ప్రచారం జరుగుతోంది.
పట్టుబడుతున్న అధికారులు..
కొద్దీ రోజుల నుంచి పెద్దపల్లి జిల్లాలో లంచం తీసుకుంటుడగా ఏసీబీ అధికారులకు పట్టుబడిన తీరు చూస్తేనే లంచం జిల్లాలో వేళ్లూనుకుందో అర్థం అవుతోంది. ఆగస్టు 3న పెద్దపల్లి జిల్లాలో కాల్వాశ్రీరాంపూర్ మండలంలో పని చేసిన తహసీల్దార్ రైతు భూమి పట్టా చేయడానికి రూ.50వేలు డిమాండ్ చేయగా సదరు రైతు ఏసీబీ అధికారులను ఆశ్రమయించాడు. దీంతో తహశీల్దార్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. అదే విధంగా ఈ నెల 19న అంతర్గం మండలంలోని పని చేస్తున్న ఇద్దరు ఆర్ఐలు కూడా ఇసుక ట్రాక్టర్ వద్ద లంచం డిమాండ్ చేయగా దీంతో వారు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా పక్క సమాచారంతో వారి నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెయిడ్ చేసి పట్టుకున్నారు. పక్కా సమాచారంతో సోమవారం పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆవరణలో కాంట్రాక్టర్ నుంచి రూ.20వేలు లంచం తీసుకుంటుండగా ఇరిగేషన్ ఏఈ నర్సింగరావు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులకు పట్టుబడినా కూడా జిల్లాలో మాత్రం ఉన్నతాధికారుల తీరు మారకపోవడంపై జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇలాంటి అవినీతి అధికారులపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని జిల్లావాసులు కోరుతున్నారు.
సర్టిఫికెట్లు, రుణాలు ఇప్పిస్తానని మోసం...
రుణాలు, సర్టిఫికెట్లు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేసిన మలహార్ రావు మండలంలో పని చేసిన జూనియర్ అసిస్టెంట్ నక్క సంపత్‌పై బాధితులు సోమవారం పెద్దపల్లి కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వికలాంగ సర్టిఫికెట్ ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేసిన మలహార్ రావు మండలంలో విధులు నిర్వహించిన జూనియర్ అసిస్టెంట్‌పై చర్యలు తీసుకుని తమ డబ్బులు ఇప్పించాలని 2018లో పని చేస్తున్నప్పుడు తమ నుంచి రూ.22వేలు తీసుకున్నాడని, ఎప్పుడు అడిగినా రేపు మాపు అని కాలయానా చేస్తున్నాడని వాపోయారు. ప్రస్తుతం పాలకుర్తి ఎంపీడీఓ కార్యాలయంలో టైపిస్ట్, జూనియర్ అసిస్టెంట్ విధులు నిర్వర్తిస్తున్నాడని, తమ డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలని కలెక్టర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో బాధితులు పేర్కొన్నారు. బాధితులు బత్తిని ఉమ, జాగారి అరవింద్, కొలకాని పుష్పలత, పల్లె రాజక్క తెలిపారు.