RBI Governor: ఆర్బీఐ గవర్నర్ కు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక

by Shamantha N |   ( Updated:2024-11-26 05:33:37.0  )
RBI Governor: ఆర్బీఐ గవర్నర్ కు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక
X

దిశ, నేషనల్ బ్యూరో: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) గవర్నర్‌ శక్తికాంతదాస్‌ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. స్వల్ప అస్వస్థతకు గురైన ఆయన.. చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయనను వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. అయితే, ఎసిడిటీతో ఆయన ఆస్పత్రిలో చేరినట్లు ఆర్బీఐ అధికార ప్రతినిధి వెల్లడించారు. ప్రస్తుతం శక్తికాంతదాస్ (RBI Governor) ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. మరో రెండు మూడు గంటల్లో ఆయన డిశ్చార్జి అవుతారని తెలిపారు. అయితే, ఈ ఘటనపై ఆసుపత్రి నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.

ఆర్బీఐ గవర్నర్ గా..

శక్తికాంతదాస్ తమిళనాడు కేడర్‌కు చెందిన 1980 బ్యాచ్ రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 25వ గవర్నర్‌గా 2018లో నియమితులయ్యారు. అప్పటి నుంచి ఆయన పదవిలో కొనసాగుతున్నారు. 2021 డిసెంబర్‌ 10న మూడేళ్ల పదవీ కాలం ముగిసింది. దీంతో, మరో పాటు పదవీకాలాన్ని కేంద్రం పొడిగించింది. కాగా.. ఈ డిసెంబర్ లో ఆయన పదవీ కాలం ముగుస్తుంది. అయితే, మరోసారి ఆయన్ని ఆర్బీఐ గవర్నర్‌గా కొనసాగించాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఐదేళ్ల కంటే ఎక్కువకాలం ఆర్బీఐ గవర్నర్ గా శక్తికాంత దాస్ పనిచేస్తున్నారు. మరోసారి ఆయన పదవీకాలం పొడిగిస్తే.. బెనగల్ రామారావు (Benegal Rama Rau) తర్వాత అత్యధిక కాలం ఆర్బీఐ గవర్నర్‌గా చేసిన వ్యక్తిగా దాస్‌ నిలవనున్నారు. ఇక, గతంలో ఆయన అంతకుముందు 15వ ఆర్థిక సంఘం సభ్యుడిగా పని చేశారు. ఆయన కేంద్ర ప్రభుత్వ, తమిళనాడు ప్రభుత్వాలకు ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగానూ పని చేశారు. రెవెన్యూ కార్యదర్శిగా, ఫెర్టిలైజర్స్‌ సెక్రటరీగా వివిధ కేంద్ర ప్రభుత్వ హోదాల్లో పనిచేశారు.

Advertisement

Next Story

Most Viewed