- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పొలాలకు వెళ్లే దారి ఆక్రమణ.. చర్యలు తీసుకోవాలని రైతుల ఫిర్యాదు..
దిశ, మిడ్జిల్ : మిడ్జిల్ మండల కేంద్రంలో సుమారు వందల సంవత్సరాల నుండి ఉన్న వ్యవసాయ పొలాలకు వెళ్లే దారిని దారిని సీతా రెడ్డి, అతని కుమారులు ఆక్రమించి దారి నుండి రైతులను వెళ్లకుండా ఇబ్బందులు సృష్టిస్తున్నారని రైతులు పేర్కొంటున్నారు. వ్యవసాయ పొలాలకు వెళ్లే దారిని ఆక్రమించిన వారి పై చర్యలు చేపట్టి పొలాలకు వెళ్లడానికి దారి చూపించాలని మిడ్జిల్ తహశీల్దార్ రాజుకు రైతులు ఫిర్యాదు చేశారు. వందల ఎకరాల పొలాలకు రైతులు వెళ్లే రహదారిని మధ్యలో ఉన్న రైతు ఆక్రమించుకొని అటు నుండి ఎవరు కూడా ప్రయాణం చేయకుండా జేసీబీతో గుంతలు తీసి రైతులకు ఇబ్బందులు సృష్టిస్తున్నారని వాపోతున్నారు.
ఈ విషయం పై గతంలో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో వారి ఆదేశాల మేరకు రహదారి ఇవ్వాలని అధికారులు సూచించారు. అయినా రహదారి వదలకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, వారి పై అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని రైతులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు చేసిన రైతులలో ఏలుగొండ శ్రీనివాస్ రెడ్డి, రాజు బంగారు, మన్యం ఇస్తారమ్మ తదితరులు ఉన్నారు.