Tirumala : తిరుమల శ్రీవారి హుండీలో చోరీ

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-11-26 06:49:05.0  )
Tirumala : తిరుమల శ్రీవారి హుండీలో చోరీ
X

దిశ, వెబ్ డెస్క్: కలియుగ దైవం తిరుమల శ్రీవారి (Tirumala) హుండీ(Srivari Hundi) చోరీ(Theft)జరిగిన ఘటన కలకలం రేపింది. అత్యంత పటిష్టమైన భద్రత, నిఘా వ్యవస్థ ఉన్న తిరుమల ఆలయంలో ఈ నెల 23న మధ్యాహ్నం 2 గంటలకు జరిగిన హుండీ నగదు చోరి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో తమిళనాడులోని శంకరన్‌ కోవిల్‌కు చెందిన వేణులింగం అనే యువకుడు వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఉన్న స్టీల్ హుండీలో కొంత నగదు చోరీ చేసి అక్కడి నుంచి పరారయ్యాడు.

చోరీ యత్నం హుండీ సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డు అయింది. విషయాన్ని గుర్తించిన శ్రీవారి ఆలయం భద్రతా సిబ్బంది సీసీ ఫుటేజ్ ఆధారంగా యువకుడిని గుర్తించి గాలించారు. అదే రోజు సాయంత్రం 6 గంటలకు వేణులింగంను పట్టుకున్న భద్రతా సిబ్బంది కార్యాలయానికి తరలించి విచారించారు. విచారణ సందర్భంగా అతడి వద్ద నుంచి రూ. 15వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత నిందితుడిని టీటీడీ విజిలెన్స్ అధికారులు పోలీసులకు అప్పగించారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed